☰
✕
Telugu Student Death : అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి..!
By Eha TvPublished on 30 Nov 2024 5:36 AM GMT
అమెరికాలోని(America) మిస్సౌరీలో(mussoorie ) తెలంగాణ విద్యార్థి(Telangana student) మృతి చెందాడు.
x
అమెరికాలోని(America) మిస్సౌరీలో(mussoorie ) తెలంగాణ విద్యార్థి(Telangana student) మృతి చెందాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు సాయితేజ(Nukarapu Sai teja) అక్కడిక్కడే మృతి చెందాడు. ఎంఎస్ చేయడానికి సాయితేజ అమెరికా వెళ్లాడు. చికాగో(Chicago) వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ (26)చనిపోయాడు.
ఎంఎస్ చదవడానికి 4 నెలల క్రితమే US వెళ్లిన సాయితేజ. సాయితేజ మృతితో రామన్నపేటలో విషాదం నెలకొంది. విద్యార్థి మృతదేహం తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. అయితే దుండగుల కాల్పులకు గల కారణాలపై అక్కడి పోలీసులు ఆరా తీస్తున్నారు.
Eha Tv
Next Story