Crying Record In Nigeria : ఇంత ఏడుపుగొట్టు రికార్డును ఎప్పుడూ చూసి ఉండరు.. ఆ టాస్క్ ఏడ్చి మొహం కడుక్కున్నట్టే ఉంది!
ఇది నిజంగానే ఏడుపుగొట్టు రికార్డు.. అసలు ఇంత వరకు ఇలాంటి రికార్డు ఒకటుంటుందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఏమిటీ రికార్డు అంటే.. ఎక్కువ సేపు ఏడుస్తూ(Crying) ఉండటం! ఇలాంటి చిత్రవిచిత్రమైన ఆలోచనలు ఎవరికొస్తాయబ్బా ఆశ్చర్యపోకండి..నైజీరియాకు(Nigeria) చెందిన టెంబు ఎబెరే(Tembu Ebere) అనే వ్యక్తి ఎలాగైనా ప్రపంచ రికార్డు సాధించాలని గట్టిగా డిసైడయ్యాడు.

Crying Record In Nigeria
ఇది నిజంగానే ఏడుపుగొట్టు రికార్డు.. అసలు ఇంత వరకు ఇలాంటి రికార్డు ఒకటుంటుందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఏమిటీ రికార్డు అంటే.. ఎక్కువ సేపు ఏడుస్తూ(Crying) ఉండటం! ఇలాంటి చిత్రవిచిత్రమైన ఆలోచనలు ఎవరికొస్తాయబ్బా ఆశ్చర్యపోకండి..నైజీరియాకు(Nigeria) చెందిన టెంబు ఎబెరే(Tembu Ebere) అనే వ్యక్తి ఎలాగైనా ప్రపంచ రికార్డు(World Record) సాధించాలని గట్టిగా డిసైడయ్యాడు. ఇందుకోసం అవిశ్రాంతగా ఏడవాలనుకున్నాడు. మరి రికార్డు సాధించాడో లేదో తెలియదు కానీ లేనిపోని అవస్థలను కొని తెచ్చుకున్నాడు. రికార్డు బ్రేక్ చేయడం కోసం ఏకంగా ఏడు రోజుల పాటు నాన్‌స్టాప్‌గా ఏడుస్తూ పోయాడు. పోయాడంటే పోలేదు కానీ, కాసేపు చూపును కోల్పోయాడు. ఏకబిగిన వారం రోజుల పాటు ఏడుస్తూ ఉండటం వల్ల 45 నిమిషాల పాటు చూపును కోల్పోయాడు. అంతటా ఏడవడం వల్ల తలనొప్పి, మొహం వాచిపోవం, కళ్లు ఉబ్బడం జరిగాయి. టెంబు ఎబెరే గిన్నిస్ వరల్డ్ రికార్డుకు దరఖాస్తు పెట్టుకోలేదు కాబట్టి వారం రోజుల పాటు ఏడ్చిన ఏడుపంతా వృధా అయ్యింది. ఇటువంటి క్రేజీ రికార్డులు చేయడం నైజీరియన్లకు అలవాటే! ఇంతకు ముందు ఓ మహిళ వంద గంటల పాటు నాన్‌స్టాప్‌గా వంటలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.
