ఎలాన్ మస్క్ అమెరికా ఆర్థిక స్థితి గురించి ఇటీవల చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనం రేపాయి.

ఎలాన్ మస్క్ (Elon Musk)అమెరికా ఆర్థిక స్థితి గురించి ఇటీవల చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనం రేపాయి. అమెరికా (America)జాతీయ రుణం $36.17 ట్రిలియన్‌కు పైగా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ రుణ భారం, అధిక వడ్డీ చెల్లింపులు కారణంగా అమెరికా "త్వరలో దివాళా తీసే ప్రమాదం"లో ఉందని హెచ్చరించారు. ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో అమెరికా $2 ట్రిలియన్ వాణిజ్య లోటును పిచ్చితనంగా అభివర్ణించారు, అనవసర ఖర్చులు, విదేశీ సహాయం, ప్రభుత్వ కార్యక్రమాల్లో వృధా, మోసం, దుర్వినియోగాన్ని విమర్శించారు.అతిగా ఖర్చు చేయడం అమెరికాను దివాళా వైపు నడిపిస్తోంది" అని, ఈ రుణం మన పిల్లలు, మనవళ్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ(Department of Government Efficiency) ద్వారా $1 ట్రిలియన్ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో, ప్రభుత్వం అనవరసర ఖర్చులనుని తగ్గించుకోవాలని ఆయన సూచించారు. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కూడా మస్క్‌ను ప్రశంసిస్తూ, ఈ ఆర్థిక సంస్కరణలకు మద్దతు ఇచ్చారు. అమెరికా, యూరప్ వలస విధానాలను విమర్శిస్తూ, H-1B వీసాల ద్వారా నైపుణ్యం ఉన్న విదేశీ ఇంజనీర్లను తీసుకోవడం అవసరమని, అమెరికాలో సూపర్ టాలెంటెడ్ ఇంజనీర్లు తక్కువగా ఉన్నారని మస్క్‌ పేర్కొన్నారు. ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడం అధిక జాతీయ రుణంతో సంబంధం ఉన్న నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన సూచిస్తున్నారు

Updated On
ehatv

ehatv

Next Story