బాహ్య ప్రపంచానికి దూరంగా , మనుషులతో సంబంధం లేకుండా మనుగడ సాగించడం దుర్లభం. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సమాజానికి దూరంగా ఉండలేం! ఎందుకంటే మనం కూడా సమాజంలో భాగమే కాబట్టి! కానీ సెర్బియాలో(Serbia) ఓ కుటుంబం(family) ఉంది. కొన్నేళ్ల పాటు ఆ ఫ్యామిలీ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ బతికింది. ప్రపంచంలో ఏం జరుగుతున్నదో ఆ కుటుంబసభ్యులకు తెలియదు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిందన్న సంగతి కానీ, జపాన్‌లోని హిరోషిమా, నాగసాకీలపై అణ్వస్త్ర దాడులు జరిగాయన్న విషయం కానీ వారికి తెలియదు. సెర్బియాలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఓ చిన్న పాకలో ఆ కుటుంబసభ్యులు జీవించారు.

బాహ్య ప్రపంచానికి దూరంగా , మనుషులతో సంబంధం లేకుండా మనుగడ సాగించడం దుర్లభం. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సమాజానికి దూరంగా ఉండలేం! ఎందుకంటే మనం కూడా సమాజంలో భాగమే కాబట్టి! కానీ సెర్బియాలో(Serbia) ఓ కుటుంబం(family) ఉంది. కొన్నేళ్ల పాటు ఆ ఫ్యామిలీ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ బతికింది. ప్రపంచంలో ఏం జరుగుతున్నదో ఆ కుటుంబసభ్యులకు తెలియదు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిందన్న సంగతి కానీ, జపాన్‌లోని హిరోషిమా, నాగసాకీలపై అణ్వస్త్ర దాడులు జరిగాయన్న విషయం కానీ వారికి తెలియదు. సెర్బియాలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఓ చిన్న పాకలో ఆ కుటుంబసభ్యులు జీవించారు.

1978లో భూవిజ్ఞాన శాస్త్రవేత్తల బృందం హెలికాఫ్టర్‌ ద్వారా సెర్బియాలోని దట్టమైన అడవులతో కూడిన ఒక ప్రాంతానికి వెళ్లింది. ఖనిజ సంపదను అన్వేషించే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు. హెలికాఫ్టర్‌ పైలెట్‌ దృష్టి అనుకోకుండా ఓ ప్రాంతంపై పడింది. నగరానికి 155 మైళ్ల దూరంలో ప్రత్యేకంగా కనిపిస్తున్న ఆ ప్రాంతాన్ని సునిశితంగా చూశాడా పైలెట్‌.. ఆ నిర్జన ప్రదేశంలో ఎవరో ఉంటున్నట్టుగా అతడికి తోచింది. ఆ విషయం శాస్త్రవేత్తలకు చెప్పాడు. వెంటనే ఆరు వేల అడుగుల ఎత్తున్న ఆ పర్వతంపైకి శాస్త్రవేత్తల బృందం వెళ్లింది. అక్కడ ఈ చిత్రమైన ఫ్యామిలీని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. కార్ప్‌ అనే వృద్ధుడు, అతడి నలుగురు పిల్లలు అక్కడ నివసిస్తున్నారు. కార్ప్‌ భార్య అకులిన్‌ 1961లో చనిపోయింది. అందుకు కారణం విపరీతమైన చలి, ఆకలి.

అయినా ఆ కుటుంబసభ్యులు ఆ ప్రాంతం విడిచి వెళ్లలేదు. అంత ఎత్తున, ఆ దట్టమైన అడవిలో ఎలా ఉండగలరుతున్నారో సైంటిస్టులకు అంతుపట్టలేదు. కేవలం ఎలుగుబంట్లు, తోడేళ్ల వంటి జంతువులు మాత్రమే అక్కడ మనగలవు. ప్రపంచంతో సంబంధాలను పూర్తిగా తెంచుకుని ఆ కుటుంబం అక్కడ నివాసముంటోంది. శాస్త్రవేత్తలను చూసిన ఆ వృద్దుడిలో తొలుత ఎలాంటి రియాక్షనూ లేదు. కొంచెం భయం మాత్రం ఆ కుటుంబ సభ్యులలో కనిపించింది. సైంటిస్టుల బృదంలోని ఓ జియాలజిస్ట్‌ గలీనా పిస్మెన్స్కాయ ఆ వృద్దుడిని పరిచయం చేసుకున్నారు. మొదట ఆ వృద్ధుడికి నమస్కారం పెట్టారు గలీనా. కాసేపటికి 'మీరు ఇంత దూరం వచ్చారు.

మీకు స్వాగతం' అని నెమ్మదిగా అన్నాడా వృద్ధుడు. బెరుకు తగ్గిన తర్వాత వృద్ధుడు తన గాధను చెప్పుకొచ్చాడు. రష్యాను స్టాలిన్‌ పాలిస్తున్న కాలంలో అంటే 1936లో కమ్యూనిస్టులు అతడి తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపేశారట! ఆ భయంతో కార్ప్‌ లైకోవ్‌ తన భార్యను, తొమ్మిదేళ్ల కుమారుడు సావిన్‌ను, రెండేళ్ల కూతురు నటాలియన్‌ను వెంటపెట్టుకుని ఈ దట్టమైన అటవీ ప్రాంతానికి వచ్చాడట! ఇక్కడే ఓ పాక వేసుకుని ఉండసాగారట! కార్ప్‌ దంపతులకు ఇక్కడే 1940, 1943లో మరో ఇద్దరు పిల్లలు కలిగారట! ఈ ఇద్దరు పిల్లలు ఇదే ప్రపంచమనుకున్నారు. బయట చాలా పెద్ద ప్రపంచం ఉందన్న సంగతి వారికి తెలియకపోవడం విషాదం.

శాస్త్రవేత్తలకు వారి జీవన విధానాన్ని చూసి బాధేసింది. వారిని తమతో పాటు తమ క్యాంప్‌కు తీసుకెళ్లారు. క్యాంప్‌ను చూసి గలీనా ఫ్యామిలీ ఆశ్చర్యపోయింది. వారి దగ్గర ఉన్న పలు ఆధునిక పరికరాలను చూసి నివ్వెరపోయింది. తమతో పాటు వచ్చేయమని సైంటిస్టుల బృందం ఎంతగా ప్రాధేయపడినా వారు ససేమిరా అన్నారు. 1981లో సావిన్‌, నటాలియాలు చనిపోయారు. ఆహార సమస్య కారణంగా మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్నాయ. అదే మరణానికి దారి తీసింది. మరో కూతురు న్యూమోనియాతో చనిపోయింది. కుటుంబంలోని ముగ్గురు సభ్యులు చనిపోయిన నేపథ్యంలో కార్ప్‌ను, అతడి మరో కూతురును ఆ అడవిని వదిలపెట్టి రావాల్సిందిగా శాస్త్రవేత్తలు కోరారు. అప్పుడు కూడా వారు తమ మనసు మార్చుకోలేదు. 1988, ఫిబ్రవరి 16న కార్ప్‌ కూడా కన్నుమూశాడు. విచిత్రమేమింటే అతడి కూతురు ఇంకా ఆ దట్టమైన అడవిలో ఒంటరిగా ఉండటం! అది విచిత్రం కాదు.. విషాదం..

Updated On 22 Aug 2023 9:00 AM GMT
Ehatv

Ehatv

Next Story