పాకిస్తాన్‌(pakistan) మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను(Imran Khan) లోషఖానా అవినీతి కేసులో జైల్లో వేశారు కదా! పైగా అయిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా వేశారు కదా! అంతకు ముందు కూడా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రతిష్టను దెబ్బతీయడానికి చాలా కుట్రలు జరిగాయట! అసలు మ్యాటరేమింటే ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్‌ఖాన్‌ తప్పించడానికి అమెరికా కారణమట! ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి తప్పించాలని పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని అమెరికా ప్రోత్సహించిందని ది ఇంటర్‌సెప్ట్‌(Intercept) అనే అంతర్జాతీయ ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది.

పాకిస్తాన్‌(pakistan) మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను(Imran Khan) తోషఖానా(Toshkhana) అవినీతి కేసులో జైల్లో వేశారు కదా! పైగా అయిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా వేశారు కదా! అంతకు ముందు కూడా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రతిష్టను దెబ్బతీయడానికి చాలా కుట్రలు జరిగాయట! అసలు మ్యాటరేమింటే ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్‌ఖాన్‌ తప్పించడానికి అమెరికా కారణమట! ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి తప్పించాలని పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని అమెరికా ప్రోత్సహించిందని ది ఇంటర్‌సెప్ట్‌(The Intercept) అనే అంతర్జాతీయ ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది.

దీనికి రుజువులుగా పాకిస్తాన్‌ ప్రభుత్వానికి సంబంధించిన కీలక పత్రాలు వెలుగులోకి వచ్చినట్టు పేర్కొంది. ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఓ రోజు ముందు అమెరికాలో పాకిస్తాన్‌ రాయబారికి, అమెరికా ప్రభుత్వాధికారులకు మధ్య ఓ సమావేశం జరిగిందట! రష్యా -ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం విషయంలో ఇమ్రాన్‌ఖాన్‌ తటస్థ వైఖరి అవలంబించారు. ఇది అమెరికాకు కోపం తెప్పించింది. అందుకే ఆయనను ప్రధాని పదవి నుంచి తప్పించాలని అమెరికా అనుకుందని ఇంటర్‌సెప్ట్ మీడియా వివరించింది.

2022, మే 7వ తేదీన అమెరికాలో పాకిస్తాన్‌ రాయబారి అసద్‌ మజీద్‌ ఖాన్‌తో అమెరికా హోంశాఖలోని ఇద్దరు ముఖ్య అధికారులతో పాటు దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డొనాల్డ్‌ లూ సమావేశమయ్యారు. ఇది జరిగిన మరుసటి రోజు అంటే 2022, మే 8వ తేదీన ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 2022, ఏప్రిల్‌ 10వ తేదీన ప్రధానమంత్రి పదవి నుంచి ఇమ్రాన్‌ఖాన్‌ తప్పుకున్నారు.

తర్వాత షెహబాజ్‌ షరీఫ్‌(Shehbaz Sharif) ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టారు. పాకిస్తాన్‌ రాయబారి, అమెరికా ప్రభుత్వ అధికారుల మధ్య భేటీకి ముందు ఇమ్రాన్‌ఖాన్ పాకిస్తాన్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. ఇందులో అమెరికాను ఉద్దేశించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మీరు చెప్పిందల్లా చేయడానికి మేము మీ బానిసలం కాదు. మాకు రష్యాతో పాటు అమెరికాతో స్నేహబంధం ఉంది. అలాగే చైనా, యూరప్‌ దేశాలలో కూడా మాకు మిత్రులు ఉన్నారు.

మేము ఏ కూటమిలో భాగస్వామ్యులం కాదు' అని ర్యాలీలో ప్రసంగిస్తూ ఇమ్రాన్‌ఖాన్‌ అన్నారు. ఇమ్రాన్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై యూరప్‌ దేశాలతో పాటు అమెరికా కూడా ఆందోళనగా ఉందని పాకిస్తాన్‌ రాయబారికి డొనాల్డ్‌ లూ చెప్పినట్టు డ్యాకుమెంట్లలో ఉందని ఆంగ్ల పత్రిక తెలిపింది.
ఒకవేళ ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నెగ్గితే.. పాకిస్తాన్‌ ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ చేసిన రష్యా పర్యటనను వాషింగ్టన్‌ క్షమిస్తుందని డోనాల్డ్‌ చెప్పినట్లు ది ఇంటర్‌సెప్ట్‌ పేర్కొంది. అవిశ్వాస తీర్మానం సమయంలో తనను ప్రధాని పదవి నుంచి తొలగించడం వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని అమెరికాను ఉద్దేశించి ఇమ్రాన్‌ఖాన్‌ పరోక్ష వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే!

Updated On 10 Aug 2023 4:01 AM GMT
Ehatv

Ehatv

Next Story