ఫేస్‌బుక్ అనేది ఈ భారతీయ సంతతి వ్యక్తి ఆలోచన, మార్క్ జుకర్‌బర్గ్ అతన్ని మోసం చేశాడని ఎందరికి తెలుసు.

ఫేస్‌బుక్ అనేది ఈ భారతీయ సంతతి వ్యక్తి ఆలోచన, మార్క్ జుకర్‌బర్గ్ అతన్ని మోసం చేశాడని ఎందరికి తెలుసు. దొంగిలించబడిన ప్రాజెక్ట్ వెనుక ఉన్న షాకింగ్ కథ. నేడు బిలియన్ల డాలర్ల విలువైన కంపెనీ అయిన మెటా యాజమాన్యంలోని భారీ సోషల్ నెట్‌వర్కింగ్ సేవ అయిన ఫేస్‌బుక్, ఒక భారతీయ సంతతి వ్యక్తి ఆలోచన. అవును, ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఫేస్‌బుక్ ఆలోచనతో మొదట ముందుకు వచ్చింది భారతీయ సంతతి వ్యక్తి. 2004లో, భారత సంతతికి చెందిన హార్వర్డ్ విద్యార్థిని దివ్య నరేంద్ర, వింక్లెవోస్ కవలలతో కలిసి ఈ ఆలోచన చేశారు.

దివ్య నరేంద్ర, అతని సహచరులు మనం ఇప్పుడు ఫేస్‌బుక్‌గా గుర్తించే దాని వెనుక ఉన్న సాంకేతికతను అభివృద్ధి చేశారు, కానీ వారికి ఆ క్రెడిట్‌ దక్కలేదు. మార్క్ జుకర్‌బర్గ్ ద్రోహం చేశాడని దివ్య నరేంద్ర ఆరోపించారు. అమెరికాకు వలస వచ్చిన భారతీయ ప్రవాసుల పెద్ద కుమారుడు దివ్య నరేంద్ర ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. ఫేస్‌బుక్ ఉనికిలోకి రావడానికి రెండు సంవత్సరాల ముందు, డిసెంబర్ 2002లో, దివ్య, తోటి హార్వర్డ్ విద్యార్థులను కనెక్ట్ చేయడానికి సోషల్ నెట్‌వర్క్" గురించి ఆలోచిన చేశాడు. అతను ఈ ఆలోచనను తన ఇద్దరు సన్నిహితులు, కామెరాన్, టైలర్‌లతో చర్చించాడు. దీనిని 'హార్వర్డ్ కనెక్షన్' అని పిలవాలని నిర్ణయించుకున్నారు.

ఈ ఆలోచనతో, దివ్య సోషల్ నెట్‌వర్క్ కోసం ప్రోగ్రామ్ రాసిన మొదటి వ్యక్తి, హార్వర్డ్ సీనియర్ సంజయ్ మావిన్‌కుర్వేను సంప్రదించారు. కానీ సంజయ్ గ్రాడ్యుయేషన్ తర్వాత, అతను ప్రాజెక్ట్‌ను అసంపూర్తిగా వదిలేసి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత దివ్య మరియు వింక్లెవోస్ సోదరులు మార్క్ జుకర్‌బర్గ్ పేరును సూచించిన మరొక స్నేహితుడు విక్టర్ గావోను సంప్రదించారు. నవంబర్ 2003లో, దివ్య సోషల్ నెట్‌వర్కింగ్ ఆలోచనకు మార్క్ జుకర్‌బర్గ్ ఓకే చెప్పారు. అప్పటికే కోడింగ్ చాలా భాగం పూర్తయింది. ప్రాజెక్ట్ వివరాలు, రహస్య కోడ్‌లను మార్క్‌తో దివ్య పంచుకున్నాడు.

ప్రాజెక్ట్‌లో కొత్త భాగస్వామి అయిన మార్క్, ప్రైవేట్ సర్వర్ లొకేషన్‌లను, హార్వర్డ్‌కనెక్షన్ వెబ్‌సైట్, కోడ్ కోసం పాస్‌వర్డ్‌ను తీసుకున్నాడు. ఆ తర్వాత మార్క్‌ కూడా వారిని దూరం పెట్టాడు. కొన్ని వారాల తర్వాత, దివ్య నరేంద్ర, వింక్లెవోస్ సోదరులు మార్క్‌ దగ్గరికి వెళ్లగా అక్కడ వారు "హార్వర్డ్ కనెక్షన్" శీర్షిక కింద బహుళ లైన్ల కోడ్‌లతో కూడిన పెద్ద తెల్లటి బోర్డును చూశామని తెలిపారు. సైట్ గురించి చర్చించడానికి అతను జనవరి 13, 2004న తేదీని నిర్ణయించుకున్నాడు. జనవరి 11, 2004న, జుకర్‌బర్గ్ thefacebook.comని రిజిస్టర్ చేశాడు, ఆ డొమైన్ పేరు చివరికి ఫేస్‌బుక్‌గా మారింది. ఒక నెల తర్వాత, అతను వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ఫిబ్రవరి 6న, "తోటి హార్వర్డ్ విద్యార్థులను కనెక్ట్ చేయడానికి కొత్త సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్" గురించి క్యాంపస్‌లో ప్రచారం జరిగిన తర్వాత, దివ్య నరేంద్రకు ఫేస్‌బుక్ గురించి మొదట తెలిసింది. తమ ఆలోచనను "దొంగిలించినందుకు" జుకర్‌బర్గ్‌పై కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు నాలుగు సంవత్సరాలు కొనసాగింది, ఈ సమయంలో ఫేస్‌బుక్ ఆరు ఖండాలలో విస్తరించింది. నరేంద్ర, కామెరాన్ వింక్లెవోస్, అతని సోదరుడు టైలర్ వింక్లెవోస్ $100 మిలియన్లకు ఒప్పుకున్నారు. ఆ సమయంలో తమ ఆలోచనను దొంగిలించాడని మార్క్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. దివ్య నరేంద్రకు సెటిల్‌మెంట్ చేసి, ఫేస్‌బుక్‌లో కొన్ని షేర్లు ఇచ్చారు. ఇదీ ఫేస్‌బుక్‌ వెనుక ఉన్న అసలు కథ.

Updated On
ehatv

ehatv

Next Story