ఎక్కడ ఆ గ్రామం ఉంది.. ఏ దేశంలో ఉంది..!

స్వాల్‌బార్డ్ (Svalbard) అనేది ఒక దేశం కాదు. అది నార్వే (Norway) దేశానికి చెందిన ఒక ఆర్క్‌టిక్ ద్వీపసమూహం (archipelago). ఆర్క్‌టిక్ మహాసముద్రంలో ఉంది, ఉత్తర ధ్రువానికి దగ్గరగా. ఇది చాలా వింతగా, యూనిక్‌గా ఉంటుంది. ఏప్రిల్ 20 నుంచి ఆగస్ట్ 23 వరకు మిడ్‌నైట్ సన్, 24 గంటలు సూర్యుడు కనిపిస్తాడు, రాత్రి కూడా పగలే! అక్టోబర్ 26 నుంచి ఫిబ్రవరి 15 వరకు పోలార్ నైట్ అంటూ పూర్తి చీకటి ఉంటుంది. సూర్యుడు కనిపించడు. ఈ గ్రామంలో ప్రసవించడానికి లేదా చనిపోవడానికి అనుమతి లేదు. ప్రతి ఒక్కరూ తుపాకీని కలిగి ఉంటారు.

అంతేకాకుండా, మంచుతో కప్పబడిన ఈ దీవుల సమూహంలో, యాభైకి పైగా దేశాల ప్రజలు వీసాలు లేకుండా కలిసి జీవిస్తున్నారు. 1920 నాటి స్వాల్‌బార్డ్ ఒప్పందం కారణంగా, సంతకం చేసిన దేశాల పౌరులు వీసా లేకుండా జీవించవచ్చు, పని చేయవచ్చు. "అధికారిక వలస ప్రక్రియ లేదు.

దీని వలన స్వాల్‌బార్డ్ వీసా రహిత జోన్‌గా మారింది, ఇక్కడ ఎవరైనా నివసించవచ్చు, పని చేయవచ్చు. దాదాపు 2,500 నుండి 3,000 మంది ప్రజలు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ధృవపు ఎలుగుబంట్లు మానవుల కంటే ఎక్కువగా ఉన్నాయి. సైన్యం లేదు, ప్రసవాలకు, మరణిస్తే పూడ్చేందుకు అనుమతి ఉండదు. ఎవరికైనా ప్రసవం జరగాలన్నా, ఆరోగ్యం బాగాలేకున్నా ఆగ్రామన్ని వదిలేయాల్సిందే. ఇక్కడి మంచు మృతదేహాలను సరిగ్గా కుళ్ళిపోకుండా నిరోధిస్తుంది, ఇది గతంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసింది. ఫలితంగా, ఖననం చేయడానికి ఇకపై అనుమతి లేదు. ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే లేదా వృద్ధులైతే, వారు ద్వీపం విడిచి వెళ్లవలసి ఉంటుంది. ఎవరైనా పనిచేయడం చేతగాకపోయినా ఆ గ్రామాన్ని వదిలేయాల్సిందే. ఇక్కడ గర్భిణీలను, అనారోగ్యంపాలైనవారిని మెయిన్‌ల్యాండ్ నార్వేకు పంపేస్తారు. పెర్మాఫ్రాస్ట్ వల్ల డెడ్ బాడీలు డికంపోజ్ కావు, అందుకే బరియల్‌కు అనుమతి లేదు

Updated On
ehatv

ehatv

Next Story