Miss World: స్పాన్సర్లను సాటిస్‌ ఫై చేయాలని చెప్పారు.. అందుకే మిస్‌ వరల్డ్‌ పోటీ నుంచి తప్పుకున్నా

మిస్ ఇంగ్లాండ్ 2024, మిల్లా మాగీ, హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీ నుంచి మధ్యలోనే తప్పుకుంది. ఆమె అధికారికంగా "వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు" వల్లే వెళ్లిపోయానని తొలుత వివరించింది. అయితే, మిల్లా ది సన్‌ ఇంటర్వ్యూలో మరింత సంచలనాత్మక కారణాలను వెల్లడించింది. తనను "వేశ్యలా" చూశారని పోటీలో భాగంగా ధనవంతులైన పురుష స్పాన్సర్ల ముందు ప్రదర్శనలు ఇవ్వాలని కోరారని.. ఉదయం నుంచి రాత్రి వరకు బాల్ గౌన్లు ధరించాలని, నిరంతరం మేకప్ వేసుకోవాలని చెప్పారని పేర్కొంది. "మమ్మల్ని ఆరుగురు పురుషుల టేబుల్ వద్ద కూర్చోబెట్టి, రాత్రంతా వారిని అలరించమన్నారు" అని ఆమె చెప్పింది. ఈ అనుభవాలు తనకు అసౌకర్యంగా ఉన్నాయని, అందుకే పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపింది. మిల్లా స్థానంలో మిస్ ఇంగ్లాండ్ 2024 రన్నరప్, మిస్ లివర్‌పూల్ షార్లెట్ గ్రాంట్ (25), మిస్ వరల్డ్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ప్రాతినిధ్యం వహిస్తోంది. మిల్లా మాగీ ఒక ఫిట్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్, మోడల్, మిస్ ఇంగ్లాండ్ టైటిల్ గెలిచింది. ఆమె తప్పుకోవడం మిస్ వరల్డ్ చరిత్రలో అరుదైన సంఘటన, ఇది పోటీ నిర్వహణపై, పోటీదారుల వెల్ఫేర్‌పై చర్చను లేవనెత్తింది. మిస్ వరల్డ్ పోటీ చరిత్రలో ఇలాంటి సంఘటనలు అరుదైనవే అయినా పోటీదారులు వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యలు, లేదా ఇతర కారణాల వల్ల మధ్యలో తప్పుకున్న సందర్భాలు గతంలో కూడా జరిగాయి. కానీ మిల్లా మాగీ కేసు ప్రత్యేకంగా పరిగణించబడింది. తనను వేశ్యలా ట్రీట్‌ చేశారని బహిరంగ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి.

Updated On
ehatv

ehatv

Next Story