☰
✕
Total Solar Eclipse: ఆ దేశాలను అంధకారంలోకి నెట్టిన సూర్య గ్రహణం
By YagnikPublished on 8 April 2024 8:58 PM GMT
సోమవారం ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది
x
సోమవారం ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. ఆ సమయంలో మెక్సికో, అమెరికా, కెనడాలోని నగరాలు అంధకారంలో మునిగిపోయాయి. సూర్యగ్రహణం మెక్సికోలోని పసిఫిక్ తీరంలో రాత్రి 11:37 గంటలకు మజత్లాన్‌లో మొదలైంది. 2017 తర్వాత ఉత్తర అమెరికాకు ఇది తొలి సంపూర్ణ గ్రహణం. భూమి- సూర్యుని మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చే ఖగోళ సంఘటన ఇది. సూర్యుడిని పూర్తిగా కప్పేస్తుంది. ఉత్తర అమెరికా అంతటా సూర్య గ్రహణం కనిపించింది.
సూర్యగ్రహణం మొత్తం నాలుగు నిమిషాల వరకు కొనసాగింది. భారతదేశంలోని ఖగోళ ఔత్సాహికులు "రింగ్ ఆఫ్ ఫైర్" సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి మే 21, 2031 వరకు వేచి ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా కేరళ, తమిళనాడులో సూర్యగ్రహణం కనిపిస్తుంది.
Yagnik
Next Story