అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనాపై మరోసారి కోపం వచ్చింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనాపై మరోసారి కోపం వచ్చింది. ఇప్పటికే అనేక దేశాలపై పెద్ద ఎత్తున సుంకాలు విధించిన ఆయన తాజాగా.. చైనాపై అదనంగా మరో 100 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఆ దేశాధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో జరగాల్సిన శిఖరాగ్ర సమావేశాన్ని సైతం రద్దు చేస్తానని హెచ్చరించారు. అరుదైన ఖనిజాలపై చైనా ఎగుమతి నియంత్రణలను విధించడాన్ని ప్రతిఘటిస్తూ.. ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. చైనా తీసుకున్న చర్యలను అసాధారణంగా దూకుడుగా అభివర్ణించిన ట్రంప్.. ఈ అదనపు సుంకాలు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. చైనా ఇలాంటి చర్య తీసుకుంటుందని తానసలు ఊహించలేదని, కానీ వారు అదే నిర్ణయం తీసుకుని తనకు కోపాన్ని తెప్పించారన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకారం, చైనా నుండి దిగుమతులపై ప్రస్తుతం ఉన్న సుంకాలపై మరింత 100 % టారిఫ్ విధించబోతున్నారని ప్రకటించారు.
