అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) విదేశీ చిత్రాలపై 100% దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) విదేశీ చిత్రాలపై 100% దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తెలుగు సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికాలో ప్రదర్శించే సినిమాలపై 100% సుంకం విధించబడుతుంది. ఒక తెలుగు సినిమా(Telugu cinema)ను అమెరికాలో విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్(distribution ) ఒక సినిమా హక్కుల కోసం చెల్లించే మొత్తానికి సమానమైన మరో 100% ట్యాక్స్‌గా చెల్లించాలి. ఒక సినిమా హక్కుల కోసం $1 మిలియన్ అంటే సుమారు ₹8.3 కోట్లు చెల్లిస్తే, అదనంగా $1 మిలియన్ ట్యాక్స్‌గా చెల్లించాలి. ఫలితంగా, మొత్తం ఖర్చు $2 మిలియన్‌కు రెట్టింపవుతుంది. తెలుగు సినిమాలకు అమెరికాకు పెద్ద మార్కెట్. 2023లో భారతీయ సినిమాలు ముఖ్యంగా తెలుగు, హిందీ సినిమాలకు అమెరికా(America)లో రూ.1670 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ట్యాక్స్ వల్ల డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు రెట్టింపు కావడంతో చాలా సినిమాలకు ఆర్థికంగా నష్టదాయకంగా మారుతుంది. ఇప్పటికే అమెరికాలో తెలుగు సినిమా టికెట్ ధరలు $15-$35 మధ్య ఉన్నాయి ముఖ్యంగా ప్రీమియర్ షోలకు అదనం. ఈ ట్యాక్స్ వల్ల టికెట్ ధరలు $30-$100 వరకు పెరిగే అవకాశం ఉంది. డిస్ట్రిబ్యూటర్లు ఈ అదనపు ట్యాక్స్ భారాన్ని భరించలేక, కొత్త సినిమాల కొనుగోలును నిలిపివేస్తున్నారు. తెలుగు సినిమాలు, ముఖ్యంగా పెద్ద బడ్జెట్ చిత్రాలు RRR, బాహుబలి 2, పుష్ప 2(Pushpa 2) అమెరికా నుండి గణనీయమైన ఆదాయాన్ని పొందుతాయి. ఈ ట్యాక్స్ వల్ల ఈ ఆదాయం గణనీయంగా తగ్గవచ్చు, ఇది నిర్మాతలకు నష్టం కలిగిస్తుంది. ఈ ట్యాక్స్ OTT ప్లాట్‌ఫామ్‌లకు కూడా వర్తిస్తే, తెలుగు సినిమాలను అమెరికా ప్రేక్షకుల కోసం కొనుగోలు చేయడం ఖరీదైనదిగా మారుతుంది. ఫలితంగా, ఈ ప్లాట్‌ఫామ్‌లు తెలుగు కంటెంట్‌లో పెట్టుబడులను తగ్గించవచ్చు. ఇది తెలుగు సినిమాల డిజిటల్ రిలీజ్‌లకు కూడా ఆటంకం కలిగించవచ్చు, ఎందుకంటే OTT ఆదాయం కూడా తెలుగు చిత్రాలకు ముఖ్యమైన ఆదాయ వనరు. ఈ నిర్ణయం హాలీవుడ్‌ను కూడా ప్రభావితం చేయవచ్చని, ఎందుకంటే హాలీవుడ్(Hollywood) సినిమాలు అంతర్జాతీయ మార్కెట్‌లో 75% ఆదాయాన్ని సంపాదిస్తాయని హెచ్చరించారు. తెలుగు సినిమాలు అమెరికాలో 38-40 రాష్ట్రాల్లో విడుదలవుతాయి, ముఖ్యంగా టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ వంటి ప్రాంతాల్లో వీటికి మంచి మార్కెట్‌ ఉంది. ట్రంప్ ప్రతిపాదించిన 100% దిగుమతి సుంకం తెలుగు సినిమాల డిస్ట్రిబ్యూషన్ ఖర్చులను రెట్టింపు చేస్తుంది, టికెట్ ధరలను పెంచుతుంది. అమెరికాలో విడుదలలను పరిమితం చేయవచ్చు. ఇది పెద్ద స్టార్ చిత్రాలతో పాటు చిన్న బడ్జెట్ సినిమాలను కూడా దెబ్బతీస్తుంది. OTT ప్లాట్‌ఫామ్‌లపై ఈ ట్యాక్స్ వర్తిస్తే, డిజిటల్ ఆదాయం కూడా తగ్గవచ్చు. దీని వల్ల హీరోల మార్కెట్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

ehatv

ehatv

Next Story