డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.

డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఒక్కొక్కరికి 1,000 డాలర్లు అంటే సుమారు 83,000 రూపాయలు చెల్లించనుంది. ఈ పథకాన్ని యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (US Department of Homeland Security)అమలు చేస్తోంది. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లే అక్రమ వలసదారులకు 1,000 డాలర్ల నగదు, విమాన టికెట్(Flight Ticket) లేదా ఇతర ప్రయాణ సహాయం అందించబడుతుంది. ఈ చెల్లింపు వారు తమ స్వదేశానికి చేరుకున్న తర్వాతే జరుగుతుంది, దీనిని CBP హోమ్ యాప్ ద్వారా ధృవీకరిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా, వలసదారులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి మరియు స్వచ్ఛంద రిపాట్రియేషన్ కోసం దరఖాస్తు చేయడానికి CBP హోమ్ అనే కొత్తగా రూపొందించిన యాప్‌ను ఉపయోగించవచ్చు. ఈ పథకం ద్వారా అక్రమ వలసదారులను బలవంతంగా డిపోర్ట్ చేయడానికి బదులు, వారిని స్వచ్ఛందంగా వెళ్లేలా ప్రోత్సహించడం ద్వారా డిటెన్షన్, డిపోర్టేషన్ ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఒక హోండురాస్ వలసదారు ఈ ఆఫర్‌ను స్వీకరించి, చికాగో నుంచి తన స్వదేశానికి విమానంలో తిరిగి వెళ్లాడు.ఈ విధానం జర్మనీ, డెన్మార్క్ వంటి దేశాల్లో విజయవంతంగా అమలు చేశారు. ట్రంప్ పరిపాలన తన ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా అక్రమ వలసలను కట్టడి చేయడానికి కఠిన విధానాలను అమలు చేస్తోంది. ఇటీవల, అక్రమ వలసదారులకు ఆర్థిక సేవలు, సంక్షేమ ప్రయోజనాలను నిలిపివేశారు. స్వచ్ఛందంగా వెళ్లని వారిపై కఠిన చర్యలు కూడా ప్రకటించబడ్డాయి. డిపోర్టేషన్ ఆర్డర్‌లను అనుసరించని వలసదారులకు రోజుకు $998 వరకు జరిమానా విధించడం, వారి ఆస్తులను స్వాధీ నం చేసే ప్రణాళికలు ఉన్నాయి. విమర్శకులు ఈ పథకాన్ని ట్రంప్ రాజకీయ ఎజెండాగా చూస్తున్నారు, ఇది అక్రమ వలసదారులను భయపెట్టి, వారిని దేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి చేయడానికి ఉద్దేశించినదని వాదిస్తున్నారు.

ehatv

ehatv

Next Story