సోషల్‌ మీడియా(Social media) ప్లాట్‌ఫాంలో అతి ముఖ్యమైన ఎక్స్‌లో(twitter) 10 కోట్ల ఫాలోవర్స్‌కు భారత ప్రధాని మోడీ(Pm Narendra Modi) చేరుకున్నారు.

సోషల్‌ మీడియా(Social media) ప్లాట్‌ఫాంలో అతి ముఖ్యమైన ఎక్స్‌లో(twitter) 10 కోట్ల ఫాలోవర్స్‌కు భారత ప్రధాని మోడీ(Pm Narendra Modi) చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ఎక్స్‌ వేదికగా దాని అధినేత ఎలాన్‌ మస్క్(Elon musk)‌ అభినందనలు తెలిపారు. అత్యధిక మంది అనుసరించే ప్రపంచ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అభినందనలు’ అని మస్క్‌ తన ఎక్స్‌ ద్వారా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం మోడీకి ఎక్స్‌లో 100.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ వారం ప్రారంభంలోనే మోదీ ఈ మైలురాయిని చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఫాలోవర్లు ఉన్నవారిలో ఎలాన్‌మస్క్‌ 189 మిలియన్లు, ఒబామా 131 మిలియన్లు, క్రిస్టియానొ రొనాల్డో 112 మిలియన్లు, జస్టిన్‌ బీబర్‌ 110 మిలియన్లు, రిహన్నా 108 మిలియన్లు, కాటిపెర్రీ 106 మిలియన్లు, టేలర్‌ స్విఫ్ట్‌ 95.3 మిలియన్లు, ట్రంప్‌ 87.5 మిలియన్లు, లేడీ గగా 83.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story