అమెరికాలోని లాంకాస్టర్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు.

అమెరికాలోని లాంకాస్టర్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఒహియోలోని క్లీవ్‌లాండ్‌ స్టేట్ యూనివర్సిటీ( Cleveland State University)లో వీరు చదువుతున్నారు. విద్యార్థులు మృతి చెందినట్లు భారత కాన్సులేట్ వెల్లడించింది. ఈ ప్రమాదంలో మానవ్‌ పటేల్(Manav Patel)(20), సౌరవ్ ప్రభాకర్‌( Saurav Prabhakar)(23) మృతిచెందినట్లు ప్రకటిస్తూ కాన్సులేట్‌ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేసింది. మే 10న లాంకాస్టర్ కౌంటీలోని(Lancaster County) పెన్సిల్వేనియా టర్న్‌పైక్ (Pennsylvania Turnpike)వద్ద వారి వాహనం చెట్టును ఢీకొట్టి.. ఆపై వంతెనను ఢీకొట్టిందని పెన్సిల్వేనియా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనం ముందు సీటులో ఉన్న మరో వ్యక్తి గాయపడగా.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాకర్ వాహనాన్ని నడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ehatv

ehatv

Next Story