అగ్రరాజ్యం అమెరికాలో(America) మళ్లీ కాల్పుల మోత మోగింది. రెండు వేరువేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు విద్యార్థులతో పాటు ఆరుగురు చనిపోయారు. 22 మంది గాయపడ్డారు. అట్లాంటా(Atlanta), ఫ్లోరిడాలలో(Florida) ఈ సంఘటనలు జరిగాయి.

అగ్రరాజ్యం అమెరికాలో(America) మళ్లీ కాల్పుల మోత మోగింది. రెండు వేరువేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు విద్యార్థులతో పాటు ఆరుగురు చనిపోయారు. 22 మంది గాయపడ్డారు. అట్లాంటా(Atlanta), ఫ్లోరిడాలలో(Florida) ఈ సంఘటనలు జరిగాయి. మొదటి సంఘటనలో జార్జియా స్టేట్‌ యూనివర్సిటీకి(Georgia State University) చెందిన అట్లాంటా క్యాంపస్‌లో ఆదివారం తెల్లవారుజామున అయిదు గంటలకు రెండు బృందాల మధ్య గొడవ మొదలయ్యింది. ఈ సందర్భంగా రేసు ట్రాక్‌ గ్యాస్‌ స్టేషన్‌ సమీపంలో చోటు చేసుకున్న కాల్పులలో(Firing) ఇద్దరు విద్యార్థులు, మరో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరో ఘటనలో ఫ్లోరిడాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన గొడవ కారణంగా జరిగిన కాల్పులలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరో 18 మంద గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ స్థానిక హాస్పిటల్స్‌కు తరలించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు టాంపాస్‌లోని వైబర్‌ సిటీ ప్రాంతంలో ఈస్ట్ 7వ అఎవన్యూకు చెందిన 1600 బ్లాక్‌ దగ్గర ఈ దారుణం జరిగింది. కాల్పులకు పాల్పడినవారిలో ఓ నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.

Updated On 30 Oct 2023 1:03 AM GMT
Ehatv

Ehatv

Next Story