2025 జనవరి 20న అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు అమెరికా నుంచి 1,563 మంది భారతీయులను బహిష్కరించి స్వదేశానికి సాగనంపిందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

2025 జనవరి 20న అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు అమెరికా నుంచి 1,563 మంది భారతీయులను బహిష్కరించి స్వదేశానికి సాగనంపిందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. బహిష్కరించిన వారిలో ఎక్కువ మందిని వాణిజ్య విమానాల్లో తిప్పి పంపించిందని విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు. ట్రంప్‌ తొలిసారిగా అధ్యక్షుడిగా సేవలందించిన కాలంలో మొదటి నెలలోనే 37,660 మంది వివిధ దేశాలకు చెందిన వలసదారులను బహిష్కరించడం గమనార్హం. జో బైడెన్‌ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కేవలం 3,000 మందిని మాత్రమే బహిష్కరించడం గమనార్హం. ప్రస్తుతం 18,000 వేలకుపైగా భారతీయులు సరైన పత్రాలు లేకుండా జీవిస్తున్నట్లు అమెరికా వెల్లడించిన నివేదికలో పేర్కొంది.

Updated On
ehatv

ehatv

Next Story