అమెరికా ఎన్నికలకు రెడీ అయ్యింది. మన చంద్రబాబు గారే ఇంకా సిద్ధం కాకపోవడమే ఆశ్చర్యం.

అమెరికా ఎన్నికలకు రెడీ అయ్యింది. మన చంద్రబాబు గారే ఇంకా సిద్ధం కాకపోవడమే ఆశ్చర్యం. పోనీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్(Donald Trump) కానీ, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారీస్(Kamala Harris) కానీ చంద్రబాబు మద్దతు కొరకపోవడం ఇంకా ఆశ్చర్యం. కనీసం లోకేశ్, పవన్ కల్యాణ్ ను మర్చిపోవడం మరి మరి ఆశ్చర్యం. అమెరికాలో బోలెడంత మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ త్రయం చెప్తే కొందరైనా పాటిస్తారు. ముఖ్యంగా సొంత సామాజిక వర్గం వారు అయితే ఆనతి లా శిరసావహిస్తారు. చంద్రబాబుకు అమెరికాలో మస్తు క్రేజ్ ఉందని టీడీపీ అనుకూల మీడియా సందర్భం లేకున్నా రాస్తూ ఉంటాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం చంద్రబాబు కు లేదు కానీ ఉంటేనా ఈజీ గా విజయం సాధిస్తారని ఆయన అభిమానులు చెబుతుంటారు. కిందటి సారి ట్రంప్ కు మద్దతు ఇచ్చిన చంద్రబాబు ఈసారి ఎందుకో అమెరికా ఎన్నికలపై ఆసక్తి చూపించడం లేదు. బహుశా జగన్ ను తిడుతుండ టం లో బిజీ గా ఉన్నారు కాబోలు..

Updated On
ehatv

ehatv

Next Story