హెచ్‌-1బీ వీసాల జారీలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి.

హెచ్‌-1బీ వీసాల జారీలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. హెచ్‌-1బీ (H1B)కోసం ప్రస్తుతమున్న లాటరీ విధానాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ రద్దు చేసింది. బదులుగా వెయిటేజ్‌ సిస్టమ్‌ను ప్రవేశ పెట్టింది. ఉన్నత ఉద్యోగాలు,అధిక శ్రేణి వేతన దారులు, ఉన్నత నైపుణ్యం ఉన్న విదేశీయులకు మాత్రమే హెచ్‌-1బీ వీసా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27,2026 నుంచి ఈ కొత్త హెచ్‌-1బీ వీసా విధానం అమల్లోకి రానుంది.

ప్రతి సంవత్సరం 65,000 హెచ్‌‑1బీ వీసాలు, అమెరికా(America)లో ఉన్నత డిగ్రీ పొందిన వారికి అదనంగా 20,000 వీసాలు యథాతథంగా కొనసాగన్నాయి. అయితే, ఈ కొత్త విధానం అమెరికన్ ఉద్యోగులను రక్షించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ, భారతీయ ఐటీ రంగానికి తీవ్ర సవాళ్లు విసరనుంది. పెద్ద కంపెనీలు లాభపడతాయి, కానీ స్టార్టప్‌లు, తక్కువ వేతన ఆఫర్లు ఇచ్చే సంస్థలు వెనుకబడే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విదేశీ సాంకేతిక నిపుణులందరికీ సమాన అవకాశాలిచ్చే లాటరీ పద్దతిని పూర్తిగా మార్చింది. మొత్తం 85వేల హెచ్‌-1బీ వీసాల జారీకి నాలుగు నాలుగు కేటగిరీల్లో లాటరీ తీసే పద్దతి ఉండేది.ఇందులో అత్యధిక వేతనం కలిగినవారికి లెవల్‌ 4 కేటగిరిగా పరిగణింపు. వేతనాన్ని బట్టి లెవల్‌-1,లెవల్‌-2, లెవల్‌-3 కేటగిరి ఉండగా.. లెవల్‌-4 అర్హత సాధించిన వారికి ఈ ఏడాదిలో నాలుగు సార్లు లాటరీకి అవకాశం. లెవల్‌-3 అర్హత సాధించిన వారికి మూడుసార్లు, లెవల్‌-2 అర్హత సాధించిన వారికి 2 సార్లు లాటరీకి ఛాన్స్‌, ఎంట్రీలెవల్‌ ఉద్యోగులకు ఒక్కసారి మాత్రమే లాటరీకి ఛాన్స్‌. ఇచ్చేది.తాజాగా, ఆ లాటరీ సిస్టంను తొలగించింది. బదులుగా వెయిటేజీ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. వాటి ఆధారంగా హెచ్‌-1బీ వీసాల జారీ ఉంటుంది.

Updated On
ehatv

ehatv

Next Story