ఇండియా వచ్చిన H-1B వీసా హోల్డర్లకు సోషల్ మీడియా సెట్టింగ్ రూల్స్‌తో అమెరికా షాకిచ్చింది.

ఇండియా వచ్చిన H-1B వీసా హోల్డర్లకు సోషల్ మీడియా సెట్టింగ్ రూల్స్‌తో అమెరికా షాకిచ్చింది. వేలమంది అపాయింట్‌మెంట్స్ క్యాన్సిల్ అయ్యాయి. డిసెంబర్ 15 నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు ఒక్కసారిగా జులైకి మారిపోయాయి. దీంతో మనవాళ్లు ఇక్కడే చిక్కుకుపోయారు. ఆఫీసుల నుంచి అన్‌పెయిడ్ లీవ్స్ తీసుకోవాల్సి వస్తోంది. ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికా కంపెనీలు కూడా తమ ఉద్యోగులు ఎప్పుడొస్తారో తెలియక టెన్షన్ పడుతున్నాయి.

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ కొత్త నిబంధనలతో H-1B, H-4 వీసా దరఖాస్తుదారులకు షాక్ తగిలింది. ఈనెల 15న 2025 నుంచి అమల్లోకి వచ్చిన ఈ రూల్స్ ప్రకారం, సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను పబ్లిక్‌గా సెట్ చేయాలి. H-1B వీసా హోల్డర్లు, వారి డిపెండెంట్స్ H-4 అందరూ తమ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), లింక్డ్‌ఇన్ వంటి అన్ని సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్స్‌ను పబ్లిక్‌కు మార్చాలి.

గతంలో విద్యార్థులు, ఎక్స్‌ఛేంజ్ విజిటర్ల (F, M, J వీసాలు)కు మాత్రమే ఈ స్క్రీనింగ్ ఉండేది. ఇప్పుడు H-1B, H-4కు కూడా విస్తరించింది. జాతీయ భద్రత, పబ్లిక్ సేఫ్టీ కోసం అన్ని అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్‌ను ఉపయోగిస్తామని US స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

H-1B వీసా హోల్డర్లలో 70-75% మంది భారతీయులే కావడంతో ఈ నిబంధనలు ముఖ్యంగా ఇండియన్ టెక్ ప్రొఫెషనల్స్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. భారత్‌లోని అమెరికా కాన్సులేట్లలో హైదరాబాద్, చెన్నైలో వేలాది వీసా ఇంటర్వ్యూలు రద్దు చేసి 2026 మార్చి, జూన్ లేదా అక్టోబర్ వరకు రీషెడ్యూల్ చేశారు. దీంతో ఇండియాకు వచ్చిన చాలా మంది H-1B హోల్డర్లు ఇక్కడే చిక్కుకుపోయారు. సోషల్‌ మీడియాలో ఏదైనా అన్‌ యాక్సెప్టబుల్ కంటెంట్ ఉంటే, వీసా రిజెక్షన్‌ లేదా డిలే అయ్యే అవకాశం ఉంది.

Updated On
ehatv

ehatv

Next Story