Operation Sindoor : భారత్-పాక్ యుద్ధంపై అమెరికా స్పందన..!
'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది.

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్(JD Vance) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. వాన్స్ మాట్లాడుతూ ఇది రెండు దేశాలకు సంబంధించిందని.. ఆ యుద్ధంలో జోక్యం చేసుకోలేమన్నారు. తమ సైన్యం ఎవరికీ సాయం చేయదని ప్రకటించారు. ఆపై అటు భారత్(India)కు గాని పాకిస్థాన్(Pakistan)కు గాని యుద్ధం ఆపాలని చెప్పలేమన్నారు. అలా అని అణ్వాయుధాల ఉపయోగం ఎట్టిపరిస్థితిల్లోనూ జరగదని ఆయన తేల్చి చెప్పారు. అమెరికా(America) భారత్‌కు ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో మద్దతు ఇస్తోంది, కానీ రెండు దేశాలనూ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని కోరుతోంది. పాకిస్తాన్‌తో సంబంధాలు బలహీనంగా ఉన్నప్పటికీ, అమెరికా స్పష్టమైన మధ్యవర్తిత్వం చేయడం లేదు. ఈ సంఘర్షం అణు యుద్ధంగా మారకుండా చూడాలని కోరుకుంటోంది. భారత్‌తో బలమైన భాగస్వామ్యం కారణంగా అమెరికా భారత్ వైపు కొంత మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది, కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
