రాత్రికి రాత్రే రంగుమార్చుకున్న కాలువను ఎప్పుడైనా చూశారా? పోనీ విన్నారా? లేదు కదూ! విస్మయాన్ని కలిగించే ఈ ఘటన ఇటలీలో(Italy) ఉన్న నీటి నగరం వెనిస్‌లో(Venice) చోటు చేసుకుంది. వెనిస్‌ అంటేనే కాలువల నగరం! అక్కడన్నీ కాలువలే(canal).. అందులో స్వచ్ఛమైన తేట నీటితో టూరిస్టులను అమితంగా ఆకట్టుకుంటుంది గ్రాండ్‌ కెనాల్‌(Grand Canal).. కానీ ఈ కాలువ రంగు రాత్రి రాత్రే మొత్తం అసాధారణ రీతిలో ఆకుపచ్చగా(Green) మారిపోయింది. ఇది చూసి జనం ఆశ్చర్యపోయారు.

రాత్రికి రాత్రే రంగుమార్చుకున్న కాలువను ఎప్పుడైనా చూశారా? పోనీ విన్నారా? లేదు కదూ! విస్మయాన్ని కలిగించే ఈ ఘటన ఇటలీలో(Italy) ఉన్న నీటి నగరం వెనిస్‌లో(Venice) చోటు చేసుకుంది. వెనిస్‌ అంటేనే కాలువల నగరం! అక్కడన్నీ కాలువలే(canal).. అందులో స్వచ్ఛమైన తేట నీటితో టూరిస్టులను అమితంగా ఆకట్టుకుంటుంది గ్రాండ్‌ కెనాల్‌(Grand Canal).. కానీ ఈ కాలువ రంగు రాత్రి రాత్రే మొత్తం అసాధారణ రీతిలో ఆకుపచ్చగా(Green) మారిపోయింది. ఇది చూసి జనం ఆశ్చర్యపోయారు. తెల్లవారుజామున రియాల్టో బ్రిడ్జ్‌ దగ్గర కెనాల్‌ రంగు మారుతున్న వైనాన్ని గమనించిన కొందరు అధికారులకు విషయం చెప్పారు. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని వెనెటో రీజియన్‌ ప్రెసిడెంట్‌ టూకా జాయియా పోలీసులకు ఆదేశించారు. మారిన నీటి రంగుపై జనం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

ఆల్గే అంటే నాచు కారణంగా నీరు రంగును మార్చుకున్నదని జనం అనుకుంటున్నారు కానీ అందులో నిజం లేదని పరిశోధకులు అంటున్నారు. ఎవరైనా నిరసనకారులు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. ఆకతాయిల పని కూడా అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌ ద్వారా వారిని కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వెనిస్‌ గ్రాండ్‌ కెనాల్‌ ఇలా రంగు మార్చుకోవడం ఇదేం మొదటి సారి కాదు. 1968లో అర్జెంటీనా ఆర్టిస్టు నికోలస్‌ గార్సియా ఉద్దేశపూర్వకంగానే గ్రాండ్‌ కెనాల్‌లో ఫ్లూరెసెయిన్‌ అనే డైని కలిపాడు. దాంతో నీరు రంగు మార్చుకుంది. అతడు ఈ పని ఎందుకు చేశాడంటే.. ఆ సమయంలో వెనిస్‌ ఇంటర్నేషన్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ జరుగుతోంది. పర్యావరణ సమస్యలను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లడానికి ఇదే చక్కటి సమయమని అతడు భావించి ఆ పని చేశాడు.

Updated On 29 May 2023 1:41 AM GMT
Ehatv

Ehatv

Next Story