పశ్చిమాసియాలో(west Asia) ఉద్రిక్తతలు చల్లారడం లేదు.

పశ్చిమాసియాలో(west Asia) ఉద్రిక్తతలు చల్లారడం లేదు. యుద్ధ వాతావరణం నెలకొంది. లెబనాన్‌లోని హెజ్‌బొల్లాపై(Hezbollah) ఇజ్రాయెల్‌(Israel) వైమానిక దళం భీకరదాడులకు దిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ రక్షణ దళం విడుదల చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో 48 గంటలపాటు దేశవ్యాప్త ఎమర్జెన్సీని విధించారు. ఇజ్రాయిల్ వైమానికదళం ఆకాశంలోనే యుద్ధ విమానాల్లో .. ఫుయ‌ల్ నింపుకున్న వీడియోను కూడా రిలీజ్ చేశారు.

హెజ్‌బొల్లాకు చెందిన వేలాది షార్ట్ రేంజ్ రాకెట్ల‌ను త‌మ ఆప‌రేష‌న్ ద్వారా పేల్చివేసిన‌ట్లు నెత‌న్య‌హూ వెల్ల‌డించారు. ద‌క్షిణ లెబ‌నాన్ ప్రాంతంలో వేలాది హిజ్‌బొల్లా మిస్సైళ్ల‌ను.. వంద‌లాది యుద్ధ విమానాలు ధ్వంసం చేసిట్లు నెత‌న్య‌హూ చెప్పారు. అయితే ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా కూడా దాడికి దిగింది. వందలాది రాకెట్లతో విరుచుకుపడింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story