పారిస్ ఒలింపిక్స్‌(Paris Olympics)లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) అదరగొడుతోంది.

పారిస్ ఒలింపిక్స్‌(Paris Olympics)లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) అదరగొడుతోంది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగం క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌()కు చెందిన లివచ్‌ ఒక్సానా( Livach Oksana)పై 7-5 తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. పతకం దిశగా దూసుకుపోతున్నది. అంతకు ముందు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జపాన్‌(Japan)కు చెందిన సుసాకీకి( Susaki) వినేశ్‌ ఓడించింది. ఆమెను 3-2 తేడాతో ఓడించింది. వినేశ్.. సెమీస్‌లో గెలిస్తే భారత్‌కు మరో పతకం ఖాయమవుతుంది. ఇవాళ రాత్రి జరిగే సెమీ ఫైనల్‌లో గబిజా డిలైట్ (లుథేనియా) లేదా యుస్నీలిస్ లోపెజ్‌ (క్యుబా)తో తలపడుతుంది. బీజేపీ మాజీ ఎంపీ(BJP MP), రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ (Wrestling Federation)మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌(Brij Bhushan Sharan Singh) లైంగిక వేధింపులకు నిరసనగా ఢిల్లీ(Delhi) రోడ్డు పై ఆందోళన, ధర్నా చేసిన వినేశ్‌ ఫోగాట్‌ ఇప్పుడు భారత్‌(Bharat)కు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తోంది. జంతర్‌ మంతర్‌(Jantar Mantar) దగ్గర ధర్నాలు చేసిన రెజ్లర్లలో వినేశ్‌ ఒకరు. చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకుంది.

Updated On
ehatv

ehatv

Next Story