రిపబ్లికన్ అభ్యర్థి, ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) 2024 అమెరికా ప్రెసిడెంట్(America President) అభ్యర్థి రేసు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

రిపబ్లికన్ అభ్యర్థి, ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) 2024 అమెరికా ప్రెసిడెంట్(America President) అభ్యర్థి రేసు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అయోవా కాకస్‌లో విజయం సాధించిన తర్వాత వివేక్‌ రామస్వామి పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. . అయోవా ప్రైమరీ పోరులో వివేక్‌ వెంకటస్వామి ప్రభావం చూపకపోవడంతో ఈ ప్రకటన చేశారు. అంతేకాకుండా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు మద్దతు ఉంటుందని చెప్పారు.

రిపబ్లికన్ పార్టీ(Republican Party) తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అయోవా కాకసస్ ఓటింగ్ జరగగా ట్రంప్‌కు 51 శాతం ఓటింగ్‌ తొలి విజయం సాధించగా.. వివేక్‌కు కేవలం 7.7 శాతం ఓటింగే వచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధ్యక్షుడిగా ఉండేందుకు నాకు మార్గం లేదని తన మద్దతుదారులతో అన్నారు.గత ఏడాది ఫిబ్రవరిలో ఈ రేసులోకి వచ్చిన వివేక్‌ రామస్వామి పేరు ఎవరికీ తెలీదు. ఇమ్మిగ్రేషన్‌, అమెరికాకే తొలి ప్రాధాన్యం వంటి అంశాలపై తన అభిప్రాయాలను బలంగా వినిపించి, అందరి దృష్టిని ఆకర్షించారు.

Updated On 16 Jan 2024 2:18 AM GMT
Ehatv

Ehatv

Next Story