అమెజాన్ అడవుల్లో నడిచే చెట్లు అని పిలిచే సోక్రటియా ఎక్సోరైజాలేదా "వాకింగ్ పామ్" (Walking Palm Trees)అంటారు. చెట్లు నిజంగా చాలా ఆసక్తికరమైనవి, ప్రకృతి యొక్క అద్భుతం.

అమెజాన్ అడవుల్లో నడిచే చెట్లు అని పిలిచే సోక్రటియా ఎక్సోరైజాలేదా "వాకింగ్ పామ్" (Walking Palm Trees)అంటారు. చెట్లు నిజంగా చాలా ఆసక్తికరమైనవి, ప్రకృతి యొక్క అద్భుతం. వీటి ప్రత్యేకమైన రూట్ సిస్టమ్ వల్ల అవి కదలగలవని అనిపిస్తుంది. ఈ చెట్లకు స్టిల్ట్ రూట్స్ పైకి ఎత్తైన, కాండం నుండి నేరుగా నేలలోకి వెళ్లే రూట్స్ ఉంటాయి. ఈ రూట్స్ చెట్టును నేల మీద స్థిరంగా నిలబెడతాయి. చెట్టు సూర్యకాంతి(Sunlight) లేదా మెరుగైన నేల పరిస్థితుల వైపు కదలాలనుకున్నప్పుడు, అది కొత్త స్టిల్ట్ రూట్స్‌ను కావాల్సిన దిశలో పెంచుతుంది. పాత రూట్స్ క్రమంగా కుళ్లిపోతాయి లేదా బలహీనపడతాయి. ఈ విధంగా, చెట్టు ఒక దిశలో కదులుతుంది. ఇది నిజంగా నడవడం కాదు, కానీ రూట్స్ ద్వారా నెమ్మదిగా స్థానభ్రంశం చెందడం. ఒక సంవత్సరంలో ఇవి 20 మీటర్ల వరకు కదలగలవని చెప్తారు. ఈ వాకింగ్ చెట్లు అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌తో సహా మధ్య, దక్షిణ అమెరికా ట్రాపికల్ రెయిన్‌ఫారెస్ట్‌లలో కనిపిస్తాయి. పెరూ, ఈక్వెడార్, కోస్టా రికా వంటి ప్రాంతాల్లో ఇవి సాధారణం. అమెజాన్‌లోని దట్టమైన అడవుల్లో సూర్యకాంతి కోసం చెట్ల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది. అమెజాన్ అడవుల్లో సూర్యకాంతి అరుదుగా నేల వరకు చేరుతుంది. వాకింగ్ పామ్‌లు కాంతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల వైపు కదులుతాయి. నేలలో పోషకాలు లేదా స్థిరత్వం తక్కువగా ఉన్నప్పుడు, చెట్టు మెరుగైన స్థలం వైపు కదలవచ్చు. ఇతర చెట్లతో పోటీ పడకుండా, ఈ చెట్టు తన స్థానాన్ని మార్చుకోగలదు. ఈ పామ్ చెట్లు 25 మీటర్ల వరకు పెరుగుతాయి. అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో దాదాపు 400 బిలియన్ చెట్లు ఉన్నాయి, వీటిలో 16,000 విభిన్న స్పీసీస్ ఉన్నాయి. వాకింగ్ పామ్ వీటిలో అత్యంత అసాధారణమైన వాటిలో ఒకటి. ఈ చెట్లు కదలడానికి సంవత్సరాలు పట్టవచ్చు, కాబట్టి మనం చూస్తే ఒక్క రోజులో చెట్టు కదలడం కనిపించదు, కానీ దీర్ఘకాలంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

Updated On
ehatv

ehatv

Next Story