హనుమకొండ జిల్లా పరకాల మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన యారాల ఆదిరెడ్డి సతీమణి యారాల హరిత సౌత్‌ ఆస్ట్రేలియాలో లిబరల్‌ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉన్నారు.

హనుమకొండ జిల్లా పరకాల మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన యారాల ఆదిరెడ్డి సతీమణి యారాల హరిత(Haritha) సౌత్‌ ఆస్ట్రేలియాలో లిబరల్‌ పార్టీ(Liberal Party) నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఆమె 2011 నుంచి సౌత్‌ ఆస్ట్రేలియా లిబరల్‌ పార్టీకి బలమైన మద్దతురాలిగా ఉన్నారు. 2023లో టోరెన్స్‌ ఎస్‌ఈసీ బ్రాంచ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం రెండోసారి ఆ పదవిలో కొనసాగుతున్నారు. అక్కడి తెలుగు వారందరినీ ఐక్యపరచి తెలుగు సంప్రదాయాన్ని చాటుతున్నారు. మార్చి 18న జరగనున్న ఎన్నికల్లో ఎంపీగా గెలిచి తెలుగు వారి సత్తా చాటుతామంటున్నారు. 2022లో క్లెమ్‌ జిగ్‌ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు.

Updated On
ehatv

ehatv

Next Story