భర్తతో తలెత్తిన విభేదాల కారణంగా నాలుగేళ్ల కొడుకును పొట్టన పెట్టుకున్న సుచనా సేథ్‌లో అంతటి కాఠిన్యం ఎలా వచ్చింది? బెంగళూరు కేంద్రంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సేవలను అందించే ఓ స్టార్టప్‌ కంపెనీకి సీఈఓ ఈమె! తన నాలుగేళ్ల కుమారుడిని గోవాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దారుణంగా హత్య చేశారు. ఆపై డెడ్‌ బాడీని సూట్‌కేసులో కుక్కి గోవా నుంచి కర్ణాటకకు తీసుకెళ్లారు.

భర్తతో తలెత్తిన విభేదాల కారణంగా నాలుగేళ్ల కొడుకును పొట్టన పెట్టుకున్న సుచనా సేథ్‌లో అంతటి కాఠిన్యం ఎలా వచ్చింది? బెంగళూరు కేంద్రంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సేవలను అందించే ఓ స్టార్టప్‌ కంపెనీకి సీఈఓ ఈమె! తన నాలుగేళ్ల కుమారుడిని గోవాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దారుణంగా హత్య చేశారు. ఆపై డెడ్‌ బాడీని సూట్‌కేసులో కుక్కి గోవా నుంచి కర్ణాటకకు తీసుకెళ్లారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్షణికావేశంలో సరిదిద్దుకోలేని పెద్ద తప్పిదం చేసింది సుచనా సేథ్‌. జీవితాంతం కుమిలిపోయే దారుణానికి ఓడిగట్టింది. మామూలుగా అయితే సుచనా సేథ్‌ అపర మేథావి. 2021 టాప్‌ 100 బ్రిలియంట్‌ ఇన్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ ఎథిక్స్‌లో సుచనా ఒకరు. మైండ్‌ఫుల్‌ ఏఐ ల్యాబ్‌ అనే స్టార్టప్‌ను ప్రారంభించిన సుచనా గత నాలుగు ఏళ్లుగా ఈ సంస్థ ద్వారా ఆడ్వాన్స్‌మెంట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో సేవలందిస్తూ వచ్చారు. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రెస్పాన్సిబుల్ మెషిన్ లెర్నింగ్ విభాగంలో రెండేళ్ల పాటు పనిచేశారు.ది మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్‌ని స్థాపించడానికి ముందు సుచనా సేథ్ బెంగళూరులోని బూమరాంగ్ కామర్స్‌లో సీనియర్ డేటా సైంటిస్ట్‌గా ఉన్నారు. ఆమె కాస్ట్‌ ఆప్టిమైజేషన్ అండ్‌ ఇంటెలిజెన్స్‌ డేటా ఆధారిత ఉత్పత్తులను డిజైన్ చేసేవారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి ఆస్ట్రోఫిజిక్స్‌తో ప్లాస్మా ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ చేశారు. 2008లో ఫస్ట్ క్లాస్ ఆనర్స్ సాధించారు. భవానీపూర్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజ్ లో ఫస్ట్ క్లాస్ ఆనర్స్‌తో ఫిజిక్స్ (ఆనర్స్)లో బ్యాచిలర్ డిగ్రీని చదివారు.

Updated On 9 Jan 2024 7:01 AM GMT
Ehatv

Ehatv

Next Story