హఠాత్తుగా భారత్ కాల్పుల విరమణ కి అంగీకరించిందానికి కారణం ఉంది

సర్గోదా డిస్ట్రిక్ట్, కిరానా హిల్స్,పంజాబ్ ప్రావిన్స్, పాకిస్థాన్!

హఠాత్తుగా భారత్ కాల్పుల విరమణ కి అంగీకరించిందానికి కారణం ఉంది….

పాకిస్తాన్ లో సర్గోద జిల్లాలో అణు ధార్మికత లక్షణాలు బయటపడడంతో పాకిస్థాన్ సైన్యం అక్కడికి దగ్గరలో ఉన్న ప్రజలని ఖాళీ చేయించి దూరంగా వెళ్లిపొమ్మని మైకులతో ప్రచారం చేస్తున్నది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త!

కిరానా హిల్స్, సర్గోద!

కిరాన హిల్స్, సర్గోదా అనేది పాకిస్థాన్ లో అత్యంత రహస్యంగా మరియు రక్షణ ఉండే ప్రదేశం!

కిరాన హిల్స్ ని అమెరికా లో ఉన్న Area 51 తో పోలుస్తారు! రెండు చోట్లా కూడా కిలోమీటర్ల కొద్దీ దూరాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు! నిషేధిత ప్రాంతం కావడంతో ముఖ్యమైన మిలిటరీ అధికారులు తప్పితే ఎవరూ ఆ దారిదాపుల్లోకి వెళ్ళలేరు! కిరానా హిల్స్ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్చివేస్తారు! అందుకే కిరాన హిల్స్ గురుంచి ఎవరికి ఏమీ తెలిసే అవకాశం ఉండదు!

కిరాన హిల్స్ మొత్తం పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ అధీనంలో ఉంటుంది!

కిరానా హిల్స్ ప్రాంతాన్ని బ్లాక్ హిల్స్ ( నల్ల కొండలు) అని కూడా పిలుస్తారు ఎందుకంటే తక్కువ ఎత్తులో ఉంటూ ముదురు గోధుమ రంగులో ఉండే కొండలు 12 కిలోమీటర్లు వరకూ వ్యాపించి ఉంటాయి!

ఆ ప్రాంతం మొత్తం పదునైన కొండ రాళ్ళతో ఉంటుంది కనుక నడుచుకుంటూ ఎవరూ వెళ్ళలేరు! అందుకే మిలిటరీ కోవర్ట్ ఆపరేషన్స్ కోసం వాడుకోవాలని మిలిటరీ నిర్ణయం తీసుకోని 1980 లో ఆ ప్రాంతాన్ని కేవలం మిలిటరీ ఆపరేషన్స్ కోసమే అనువుగా ఉండే విధంగా అభివృద్ధి చేశారు.

1980 లోనే చుట్టుపక్కల ఉండే ప్రజలని 15 కిలోమీటర్లు దూరంగా ఉండేట్లుగా భద్రత చేశారు.

1980 లో అక్కడ భూగర్భ బంకర్లు, సొరంగాల నిర్మాణం మొదలుపెడితే 1990 లో పూర్తయింది.

కిరానా హిల్స్ తో అనుసంధానం చేస్తూ ముషాఫ్ ఎయిర్ బేస్ ని నిర్మించాక ఈ ప్రాంతం మీద అనుమానాలు మొదలయ్యాయి కానీ ఎవరివద్దా ధ్రువీకరించిన సమాచారం లేదు దశబ్దాలుగా! చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది అదీ కొద్దిమందికే!

కానీ 1980 కి ముందు అంటే 1965 లో భారత పాకిస్థాన్ ల మధ్య జరిగిన యుద్ధంలో కిరానా హిల్స్ మీద, ముషాఫ్ ఎయిర్ బేస్ మీద భారత యుద్ధ విమానాలు బాంబులు వేసాయి. దాదాపు 10 పాకిస్తాన్ యుద్ధ విమానాలు పార్కింగ్ లో ఉండగానే బాంబు దాడుల వలన ధ్వంసం అయ్యాయి అప్పట్లో. ముషాఫ్ ఎయిర్ బేస్ అప్పట్లో విమానాలని నిలిపి ఉంచడానికి మాత్రమే వాడేవారు.

1983 నుండి 1990 ల మధ్య పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త అబ్దుల్ ఖాదిర్ నేత్రుత్వంలో పాకిస్థాన్ ఆటమిక్ ఎనర్జీ కమిషన్ ( Pakistan Atomic Energy Commission -PAEC) కోల్డ్ టెస్ట్ లేదా సబ్ క్రిటికల్ న్యూక్లియర్ ఎక్స్పీరిమెంట్స్ ( Cold టెస్ట్స్ or Subcritical Nuclear Tests ) ని నిర్వహించింది. కోల్డ్ టెస్ట్ అంటే అణు బాంబు డిజైన్ చేసే క్రమంలో శుద్ధి చేసిన యూరేనియం కి బదులుగా సాంప్రదాయ పేలుడు పదార్ధాన్ని వాడుతారు. అంతా బాగుంది అని నిర్ధారణ చేసుకున్న తరువాత 1998 మే నెలలో చాగై హిల్స్ లో మొదటి అణు పరీక్ష నిర్వహించింది పాకిస్తాన్.

అణు పరీక్ష నిర్వహించిన చాగై హిల్స్ గురుంచి మాత్రమే ప్రపంచానికి తెలుసు కానీ కిరాన హిల్స్ గురుంచి ఎవరికీ తెలియదు!

అణు పరీక్ష విజయవంతం అయిన తరువాత ముషాఫ్ ఎయిర్ బేస్ ని ఎయిర్ కాంప్లెక్స్ గా అభివృద్ధి చేసి కిరానా హిల్స్ తో అనుసంధానం చేసింది.

కిరానా హిల్స్ దగ్గర సొరంగాలు తవ్వి అందులో అణు వార్ హెడ్లని భద్రపరిచింది పాకిస్థాన్!

ఒక వేళ భారత్ తో జరిగే యుద్ధంలో అణు దాడి జరిగితే కిరాన హిల్స్ లో ఉన్న సొరంగాల నుండి అణు వార్ హెడ్లని బయటికి తెచ్చి వాటిని మిసైల్ తో అనుసంధానం చేసి అక్కడి నుండి విమానాలతో తరలించడానికి ముషాఫ్ ఎయిర్ బేస్ ని ఎయిర్ Complex గా అభివృద్ధి చేశారు. అంటే సొరంగం నుండి నేరుగా Air Complex లోకి దారి ఉంటుంది కాబట్టి సాటిలైట్ కి కనిపించదు!

ఇప్పుడెలా బయటపడింది?

సర్గోద దగ్గర రేడియేషన్ ఆనవాళ్లు బయటపడడంతో తనిఖీలు చేయాల్సి రావడంతో అసలు విషయం బయటపడ్డది!

రేడియేషన్ ఎందుకు బయటపడ్డది?

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్ లోని అన్ని ప్రధాన వైమానిక స్థావరాల మీద దాడి చేసింది భారత్!అందులో భాగంగా సర్గోదా ఎయిర్ బేస్, నుర్ ఖాన్ ఎయిర్ బేస్ ల మీద ప్రెసిషన్ మిసైల్ ఆటాక్ చేసింది భారత్!

సర్గోదా, నుర్ ఖాన్ ఎయిర్ బేస్ లలో F-16,JF-17, జెట్ ఫైటర్స్ ని నిలిపి ఉంచింది పాకిస్తాన్ కాబట్టి వాటి మీద దాడి చేసింది భారత్!

విషయం ఏమిటంటే సర్గోదా, నుర్ ఖాన్ ఎయిర్ బేస్ లనుండి కిరాన హిల్స్ 20 KM దూరంలో ఉంది.

భారత్ ప్రయోగించిన మిసైల్స్ పేలుడు ధాటికి కిరానా హిల్స్ లో ఉన్న భూగర్భ సొరంగాలలో ఉన్న అణు వార్ హెడ్స్ దెబ్బతిని రేడియేషన్ బయటికి వచ్చింది అనే అనుమానం రావడం వల్ల పాకిస్థాన్ కాల్పుల విరమణ అడిగింది!

మొదట అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో భారత్ దాడులు ఆపితే మేము రేడియేషన్ లీక్ మీద పరీక్షలు నిర్వహించుకుంటాము అని వేడుకున్నది పాకిస్తాన్!

రేడియేషన్ అంటున్నారు కాబట్టి కాల్పుల విరమణ కి అంగీకరించండి అని అమెరికా అడిగితే మోడీజీ ఒప్పుకున్నారు!

నిజానికి కిరాన హిల్స్ మీద భారత్ దాడి చేయలేదు. ఒక వేళ 1965 లో లాగా కిరాన హిల్స్ తో అనుసంధానం అయి ఉన్న ముషాఫ్ Air Complex మీద దాడి చేసి ఉండిఉంటే విషయం ఇంకోలా ఉండేది!

అసలు కిరాన హిల్స్ కానీ ముషాఫ్ ఎయిర్ కాంప్లెక్స్ కానీ మా హిట్ లిస్టులో లేవని కాబట్టే మేము దాడి చేయలేదు అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ శ్రీ AK భర్తీ ప్రెస్ మీట్ లో చెప్పారు.

AK భర్తీ మరో మాట కూడా అన్నారు…అసలు కిరాన హిల్స్ లో భూగర్భ సొరంగాలు ఉన్న విషయం కానీ, అందులో అణు వార్ హెడ్స్ ని భద్రపరిచారు అన్న సంగతి కానీ మాకు ఇంతవరకూ తెలియదు కానీ ఇప్పుడు తెలిసింది అందుకు ధన్యవాదములు అని అన్నారు!

మరి అమెరికా విమానం మాటేమిటి?

విమాన రాకపోకలని రికార్డ్ చేసే Flightradar24 అనే సంస్థ అమెరికన్ బీచ్ క్రాఫ్ట్ B350( Beechcraft B350) అనే విమానం పాకిస్తాన్ గగన తలంలో ఎగరడం ని గుర్తించింది! B350 విమానం అమెరికా డిపార్ట్మెంట్ అఫ్ ఎనర్జీ సంస్థదే!

Beechcraft B350 విమానంలో ఏరియల్ మేజరింగ్ సిస్టమ్ ( Aerial Measuring System - AMS )ఉంటుంది. ఈ విమానంలో ఉండే AMS లో గామా కిరణాల సెన్సార్స్ తో మ్యాపింగ్ టూల్స్ ( GAMMA -RAY SENSORS AND MAPPING TOOLS) ఉంటాయి. ఈ విమానాన్ని గాలిలో ఎగురుతూనే కింద భూమి మీద ఉండే రేడియేషన్, దాని తీవ్రత, ఎంతవరకూ రేడియేషన్ వ్యాపించి ఉందో తెలుసుకోవడానికి మాపింగ్ టూల్స్ తో కొలవడానికి వాడతారు. జపాన్ లో సునామి వచ్చినపుడు ఫుకుషిమఅణు రియాక్టర్ నుండి వెలువడే రేడియేషన్ ని కొలవడానికి వాడారు!

ఈ విమానాన్ని 2010 లో పాకిస్థాన్ కి ఇచ్చింది అమెరికా.

So! విమానం అమెరికాదే!

అదే సమయంలో ఈజీప్ట్ నుండి మరో విమానం పాకిస్థాన్ లో లాండ్ అయ్యి కొద్దిసేపటి తరువాత తిరిగి వెళ్ళిపోయింది

ఈజీప్ట్ నుండి వచ్చిన విమానంలో బోరాన్ ( BORON) అనే కెమికల్ ఉంది దానిని పాకిస్థాన్ లో అన్ లోడ్ చేసి వెళ్ళిపోయింది!

BORON కెమికల్ ని చాలా వాటిలో ఉపయోగిస్తారు కానీ అణు వ్యర్ధాలని సురక్షితంగా ఉంచడానికి కూడా ఉపయోగిస్తారు! SO! రేడియేషన్ లీక్ అయిన మాట నిజమే! ముందు విమానంతో రేడియేషన్ తీవ్రతని కొలిచి అది లీక్ అవుతున్నదని తెలుసుకొని తరువాత BORON తో లీకేజి ని ఆపారు!

ఇదంతా జరగాలి అంటే భారత్ దాడులు చేయడం ఆపాలి కాబట్టి ముందు అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ తో మాట్లాడి JD వాన్స్ మోడీజీ తో ఫోన్ ద్వారా అభ్యర్థించిన తరువాతే మానవతా దృక్పధంతో మోడీజీ కాల్పుల విరమణకి ఒప్పుకున్నారు!

ఇక్కడ ఎవరి మధ్యవర్తిత్వం లేదు కేవలం మోడీజీ దయచూపారు అంతే!

అయినా ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది అని మోడీజీ ప్రకటించారు కదా?

కాబట్టి సినిమా కి ఇంటర్వెల్ ఇచ్చారు! క్లయిమాక్స్ ఇంకా మిగిలే ఉంది!

*******

కాంగ్రెస్ బుర్ర తక్కువ వ్యాఖ్యల కి సమాధానం!

అమెరికా ఒత్తిడి చేస్తే మోడీజీ కాల్పుల విరమణకి అంగీకరించారా?

అదే ఇందిర అయితే అమెరికా ని లెక్క చేయకుండా యుద్ధం కొనసాగించేదా?

1971 బాంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో అరేబియా సముద్రంలోకి బ్రిటన్ యుద్ధ నౌకలు, అమెరికన్ 7th fleet నావీ యుద్ధ నౌకలు మన దాడికి సిద్ధం అవుతున్నప్పుడు సోవియట్ యూనియన్ తన అణు జాలాంతర్గామిని పంపించడం వలన ఇందిర విజయం సాధించింది!

1971 లో మన దగ్గర పాకిస్తాన్ దగ్గర అణు ఆయుధాలు లేవు.

1971 లో సర్ఫెస్ to సర్ఫెస్ మిసైల్స్ లేవు.

1971 లో యుద్ధ విమానాలకి ఎయిర్ to ఎయిర్ మిసైల్స్ లేవు, కేవలం అన్ గైడెడ్ బాంబులని జారివిడిచేవారు!

సాటిలైట్ సహాయం లేదు!

అమెరికా, బ్రిటన్ తో సహా మనకి వ్యతిరేకంగా ఉండేవారు!

ఇప్పుడు ఏ దేశమూ మనకి వ్యతిరేకంగా ఎదురు చెప్పే స్థితిలో లేవు.

మన సైన్యానికి యుద్ధ ఖైదీలుగా చిక్కిన 93,000 మంది పాకిస్తాన్ సైనికులని రోజూ రెండూపూటలా రొట్టెలు పెట్టడానికి 10 లక్షలు ఖర్చు అవుతుంది మన దగ్గర

అంత డబ్బు లేదని సంతకాలు పెట్టించుకోని వదిలేసింది ఇందిర!

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది! మోడీజీ లక్ష్యం కేవలం ఉగ్రవాదులు, సైనిక స్థావరాలు మాత్రమే! పాకిస్తాన్ ప్రజలు కాదు!

జైహింద్!

ehatv

ehatv

Next Story