బ్రెజిల్‌(Brazil) వాసులు కూడా మనలాగే తృణధాన్యాలను, పప్పు దినుసులను(Pulses) సంపదగా భావిస్తారు.అందుకే కొత్త సంవత్సరం మొదటి రోజున అన్ని రకాల పప్పు దినుసులను, ధాన్యాలను కలిపి వండిన సూప్‌ను(Soup) సేవిస్తారు. ఆ రోజున తెల్ల దుస్తులు వేసుకోవాలనే ట్రెడిషన్‌ కూడా ఉంది! మెక్సికో ప్రజలు సంవత్సరం ఆఖరి రోజున అర్ధరాత్రి ఆకుపచ్చ ద్రాక్ష(Green grapes) తింటారు. అర్ధరాత్రి పన్నెండయ్యే వరకు గంటకో ద్రాక్షా తింటే శుభం కలుగుతుందన్నది వారి నమ్మకం

బ్రెజిల్‌(Brazil) వాసులు కూడా మనలాగే తృణధాన్యాలను, పప్పు దినుసులను(Pulses) సంపదగా భావిస్తారు.అందుకే కొత్త సంవత్సరం మొదటి రోజున అన్ని రకాల పప్పు దినుసులను, ధాన్యాలను కలిపి వండిన సూప్‌ను(Soup) సేవిస్తారు. ఆ రోజున తెల్ల దుస్తులు వేసుకోవాలనే ట్రెడిషన్‌ కూడా ఉంది! మెక్సికో ప్రజలు సంవత్సరం ఆఖరి రోజున అర్ధరాత్రి ఆకుపచ్చ ద్రాక్ష(Green grapes) తింటారు. అర్ధరాత్రి పన్నెండయ్యే వరకు గంటకో ద్రాక్షా తింటే శుభం కలుగుతుందన్నది వారి నమ్మకం. సిసిలీలో కొత్త సంవత్సరం రోజున న్యూడిల్స్‌(Noodle's) అస్సలు చేయరు. ఎందుకంటే న్యూడిల్స్‌ దురదృష్టాన్ని తెచ్చిపెడతాయన్నది వారి విశ్వాసం. బొలీవియాలో చిన్న చెక్కతోగానీ..కార్డుబోర్డుతోగానీ చేసిన బొమ్మలను(Toys) గుమ్మాలకు వేలాడదీస్తారు.. ఎందుకూ అంటే అదృష్టం కోసం అంటారు వీళ్లు! ఐర్లాండ్‌లో కొత్త సంవత్సరం ముందురోజు రాత్రి ఇంటి కిటికీలన్ని తెరుస్తారు. గాలి వీచే దిశను బట్టి కొత్త ఏడాది ఎలా ఉంటుందో అంచనా వేస్తారు. తూర్పు(East) నుంచి కనుక గాలి వీస్తే ఆహారం సమృద్ధిగా దొరుకుతుందనేది వీరి నమ్మకం. పడమటి(West) నుంచి గాలి వీస్తే మట్టుకు ఏడాదంతా నష్టమే జరుగుతుందట! ఏడాది చివరి రోజున జర్మనీ వాసులు సీసంలో భవిష్యత్తు దర్శనాన్ని చేసుకుంటారు. సీసాన్ని కరిగించి చల్లటి నీటిలో వేస్తారట! అందులో అది ఏర్పడే ఆకారాన్ని బట్టి ఫ్యూచర్‌ లెక్కలు వేసుకుంటారట! హృదయం(Heart) ఆకారంలో సీసం ఏర్పడితే పెళ్లవుతుందట! పడవ (Boat)ఆకారంలో వస్తే ట్రావెలింగ్‌ ఎక్కువగాఉంటుందట! పంది(Pig) షేప్‌లో వస్తే ఆహారానికి ఢోకా ఉండదట! కొలంబియా, కోస్టారికా, క్యూబా దేశాల్లో కొత్త సంవత్సరానికి చిత్రంగా ఆహ్వానం పలుకుతారు. మనం హోలి(Holi) రోజున కాముడిని దహనం చేస్తామే..! అచ్చంగా అలాగే డిసెంబర్‌ 31 అర్థరాత్రి మనిషి ఆకృతిలో ఉన్న ఓ బొమ్మను దహనం చేస్తారు.ఎందుకూ అంటే అలా చేస్తే ఏడాదిలోని చెడంతా పోతుందట! టర్కీ, ఇటలీలలో ఇంకో గమ్మత్తు ఆచారం ఉంది. న్యూ ఇయర్‌ రోజున కంపల్సరీగా రెడ్‌ కలర్‌ అండర్‌వేర్‌నే(Red colour underwear) ధరిస్తారట! రెడ్‌ కలర్‌తో న్యూఇయర్‌కు వెల్కమ్‌ చెబితే శుభం జరుగుతుందట! చిలీ దేశంలో తాల్కా అనే నగరం ఉంది.. అక్కడి ప్రజలు జనవరి ఒకటిన స్మశానానికి వెళ్లి చనిపోయిన తమ బంధుమిత్రుల సమాధుల మధ్య కూర్చొని కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. తమ ఆత్మీయులు తమ కోసం ఎదురుచూస్తున్నారన్నది వారి నమ్మకం.

Updated On 1 Jan 2024 1:29 AM GMT
Ehatv

Ehatv

Next Story