జనవరి ఫస్టయినా... ఉగాది అయినా... తమిళుల పుత్తాండు అయినా అదో వేడుక! ఎందుకంటే గతించిన కాలం కంటే భవిష్యత్తు(Future) మనకు బంగారుబాటలు వేస్తుందన్న నమ్మకం! ఆ విశ్వాసంతోనే మనం కొత్త సంవత్సరానికి(New year) ఆనందంగా స్వాగతం పలుకుతాం! అయితే న్యూఇయర్‌కు ఒక్కో దేశం ఒక్కో రకంగా వెల్కమ్‌ చెబుతుంటుంది. ఎవరి సెంటిమెంట్లు(Sentiments) వారివి మరి! ఎవరి ఆచారాలు వారివి మరి ! ఎవరి సంప్రదాయాలు వారివి మరి! కొన్ని ఫన్నీగా ఉంటాయి.

జనవరి ఫస్టయినా... ఉగాది అయినా... తమిళుల పుత్తాండు అయినా అదో వేడుక! ఎందుకంటే గతించిన కాలం కంటే భవిష్యత్తు(Future) మనకు బంగారుబాటలు వేస్తుందన్న నమ్మకం! ఆ విశ్వాసంతోనే మనం కొత్త సంవత్సరానికి(New year) ఆనందంగా స్వాగతం పలుకుతాం! అయితే న్యూఇయర్‌కు ఒక్కో దేశం ఒక్కో రకంగా వెల్కమ్‌ చెబుతుంటుంది. ఎవరి సెంటిమెంట్లు(Sentiments) వారివి మరి! ఎవరి ఆచారాలు వారివి మరి ! ఎవరి సంప్రదాయాలు వారివి మరి! కొన్ని ఫన్నీగా ఉంటాయి. కొన్ని వింతగొలుపుతాయి. కొన్నేమో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ మాటకొస్తే కొన్ని దేశాలైతే జనవరి ఒకటిని న్యూ ఇయర్‌గానే గుర్తించవు. చైనా(Chaina), కొరియా(Korea), సౌదీ అరేబియా(Saudi), ఇజ్రాయెల్‌, వియత్నాం దేశాలలో జనవరి ఫస్ట్‌న వేడుకలు గట్రాలు అస్సలుండవు. ఇక రష్యాలోఅయితే న్యూ ఇయర్‌ వేడుకలను రెండు సార్లు జరుపుకుంటారు. మామూలుగా జనవరి ఫస్ట్‌న జరుపుకునే వేడుకలు సరేసరి! ఇక రెండో కొత్త సంవత్సర ఆరంభాన్ని జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం జనవరి 14న జరుపుకుంటారు. అంటే పదిహేను రోజుల గ్యాపులోనే రెండుసార్లన్నమాట! ఇక స్వీడన్‌, ఫిన్లాండ్‌ దేశాల ప్రజలకు కూడా న్యూ ఇయర్‌ను రెండుసార్లు జరుపుకునే మహాద్భుతమైన అవకాశం ఉంటుంది. విషయానికి వస్తే స్వీడన్‌-ఫిన్లాండ్‌(Finland) దేశాలను మ్యూనియో నది విభజిస్తుంది.. ఫిన్లాండ్‌వైపు ఉన్న నగరం కారెసువాంటో. అదే స్వీడన్‌వైపు ఉన్న నగరం కారెసువాండో. పేర్లు కూడా దాదాపు ఒక్కలాగే ఉన్నాయి కదూ! స్వీడన్‌ కంటే ఫిన్లాండ్‌ సమయం గంట ముందుంటుంది! ఫిన్లాండ్‌లో 2024 న్యూ ఇయర్‌కు వెల్కమ్‌(Welcome) చెప్పి. ఆ తర్వాత ఓ పావుగంట వంతెన మీద నడిచి స్వీడన్‌కు చేరుకోవచ్చు. అక్కడ మళ్లీ 2024కి వెల్కమ్‌ చెప్పవచ్చు. రెండు దేశాలలో చాలామంది ఇట్టాగే చేస్తారు! అలాగే స్పెయిన్‌(Spain)-పోర్చుగల్‌ మధ్య కూడా టైమ్‌లో వన్‌ అవర్‌ తేడా ఉంటుంది. స్పెయిన్‌లో న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పి గ్వాడియానా నదిని దాటేసి 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే పోర్చుగల్‌లో మరోసారి కొత్త సంవత్సర ఆగమనాన్ని అస్వాదించవచ్చు.

Updated On 1 Jan 2024 1:06 AM GMT
Ehatv

Ehatv

Next Story