రూ.30 కోట్ల ప్రియుడి లాటరీ సొమ్ముతో యువతి పరారైన సంఘటన కెనడాలో జరిగింది.

రూ.30 కోట్ల ప్రియుడి లాటరీ సొమ్ముతో యువతి పరారైన సంఘటన కెనడాలో జరిగింది. ఇది వైరల్‌గా మారిన ఒక లాటరీ మోసం కేసు, కాబట్టి 2024లో లారెన్స్ కాంప్‌బెల్ సుమారు రూ.30 కోట్లు విలువైన లాటరీ గెలిచాడు. అయితే, అతని వద్ద చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు (ID) లేకపోవడంతో, లాటరీ అధికారులు ఎవరైనా ఒకరిని తన తరపున డబ్బు క్లెయిమ్ చేయాలని సలహా ఇచ్చారు. లారెన్స్ తన గర్ల్‌ఫ్రెండ్ క్రిస్టల్ ఆన్ మెక్కేను(Crystal Ann McKay) నమ్మి, ఆమె పేరిట లాటరీ డబ్బును క్లెయిమ్ చేయమని చెప్పాడు. అప్పట్లో వీరిద్దరూ ఒకటిన్నర సంవత్సరాలకు రిలేషన్‌లో ఉన్నారు. క్రిస్టల్ డబ్బును క్లెయిమ్ చేసిన తర్వాత, లారెన్స్‌ను విడిచిపెట్టి, అతన్ని సోషల్ మీడియాలో బ్లాక్ చేసి, మరో వ్యక్తితో పరారైంది. రూ.30 కోట్లతో కలిసి కొత్త ప్రియుడితో అదృశ్యమైంది. లారెన్స్ కాంప్‌బెల్ తన డబ్బును తిరిగి పొందేందుకు మనిటోబా కోర్ట్ ఆఫ్ కింగ్స్ బెంచ్లో(Manitoba King's Bench Court) క్రిస్టల్ ఆన్ మెక్కే, వెస్టర్న్ కెనడా లాటరీ కార్పొరేషన్ (WCLC), మనిటోబా లిక్కర్ అండ్ లాటరీస్‌పై కేసు దాఖలు చేశాడు. లాటరీ కార్పొరేషన్ సరైన సలహా ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించాడు. కేసు కోర్టులో ఉంది, క్రిస్టల్ మరో వ్యక్తితో జీవిస్తున్నట్లు తెలిసింది. ఈ సంఘటన కెనడాలో వైరల్‌గా మారింది.

Updated On
ehatv

ehatv

Next Story