ఓ మహిళ కుటుంబ కారులో(Car) 4.5 కిలోలశిశువుకు జన్మనిచ్చింది(child birth).

ఓ మహిళ కుటుంబ కారులో(Car) 4.5 కిలోలశిశువుకు జన్మనిచ్చింది(child birth). ప్రసవం కోసం కారులో ఆస్పత్రికి వెళ్తుండగా అనుకోకుండా మహిళకు నొప్పులు(Labour pains) వచ్చాయి. వారు అనుకున్నదాని కంటే వేగంగా ప్రసవం జరిగిపోయింది. కారులో వెళ్తుండగా ఒక్కసారిగా భయాందోళనలకు మహిళ గురైంది.. ఆసుపత్రికి చేరుకోవడానికి సమయం లేకపోవడంతో, ఆమె భర్త పక్కనే సురక్షితంగా కారును నడిపేందకు ప్రయత్నించాడు. తన భార్యకు తీవ్రమైన ప్రసవ నొప్పులు రావడంతో ఆమెను ఓదార్చాడు. ప్రసవం ఆసన్నమైనందున, భర్త ఆమె సీటు బెల్టును త్వరగా విప్పి, ప్యాసింజర్ సీట్‌లోనే ప్రసవానికి సాయం చేశాడు. మహిళ కారులోనే ప్రసవించగలిగింది. 4.5 కిలోలు ఉన్న మగబిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిసేపటి తర్వాత బేబీ బాయ్‌ ఏడ్చి ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికాలో(America) ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత సిబ్బంది త్వరగా తల్లి, బిడ్డకు వైద్య పరీక్షలు చేయించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా, క్షేమంగా ఉన్నారని నిర్ధారించారు. ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్పత్రికి వెళ్తుండగా 4.5 కిలోల బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Updated On
Eha Tv

Eha Tv

Next Story