ఎన్నడూ లేనంత కరువు జింబాబ్వేలో ఉంది. అక్కడి ప్రభుత్వం ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుంది.

ఎన్నడూ లేనంత కరువు జింబాబ్వేలో ఉంది. అక్కడి ప్రభుత్వం ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుంది. ఆకలితో అలమటిస్తున్న పౌరులకు ఆహారం అందించేందుకు 200 ఏనుగులను వధించేందుకు జింబాబ్వే(Zimbabwe)అధికారులు అనుమతి ఇచ్చారు. దేశంలోని దాదాపు సగం జనాభా తీవ్రమైన ఆకలి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నందున 200 ఏనుగులను చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు చెప్తున్నారు. నమీబియాలో కూడా కరువు కారణంగా ఆహార అభద్రతను పరిష్కరించడానికి ఏనుగులు ఇతర వన్యప్రాణులను చంపి మాంసాన్ని ప్రజలకు అందించింది. నమీబియాను అనుసరిస్తూ జింబాబ్వే ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ చర్యపై న్యాయవాదులు, జంతు పరిరక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. జింబాబ్వేలో అంచనా వేసిన 45 వేల కంటే ఎక్కువ ఏనుగులు ఉన్నాయని, ప్రస్తుతం 84వేలకుపైగానే ఏనుగులు ఉన్నాయిని, 200 ఏనుగులను చంపి తీవ్ర ఆహార సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాలకు మాంసాన్ని పంచాలని నిర్ణయించామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. నమీబియా(Namibia)లో ఏనుగులతో సహా 700 వన్యప్రాణులను చంపి ప్రజలకు మాంసాన్ని అందించారని, ఇదే తరహాలో ఇక్కడ కూడా చేస్తున్నామన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story