భారతదేశంలో సుమారు 1,800 గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ ఉన్నాయి. ఇది ప్రపంచంలో ఉన్న సెంటర్లలో దాదాపు సుమారు 55% కి సమానం.

భారతదేశంలో సుమారు 1,800 గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ ఉన్నాయి. ఇది ప్రపంచంలో ఉన్న సెంటర్లలో దాదాపు సుమారు 55% కి సమానం. ప్రస్తుతం వీటి ద్వారా 1.9 లక్షల మంది నిపుణులు పనిచేస్తున్నారు. TeamLease అంచనా ప్రకారం 2029–30 నాటికి భారతదేశంలో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల ద్వారా 28 లక్షల నుంచి 40 లక్షల వరకు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. కొత్త నియామాకాల్లో 14–22% ఫ్రెషర్స్‌ ఉంటారని నివేదిక చెబుతుంది. ప్రత్యేకంగా డిజిటల్ స్కిల్స్ AI, క్లౌడ్, డేటా ఇంజనీరింగ్, సైబర్‌సెక్యూరిటీ లలో ఉంటాయని తెలిపింది. ఈ గ్లోబల్‌ కేపబులిటీ సెక్టర్ మొత్తం చూస్తే, ఇది సరిగ్గా 10.4 మిలియన్ ఉద్యోగాలను క్రియేట్‌ చేస్తున్నదని టీంలీజ్‌ అంచనా వేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వీటిలో 19 లక్షల మంది ప్రొఫెషనల్స్‌ ఉండగా, ఎగుమతులపరంగా 64.6 బిలియన్‌ డాలర్ల ఆదాయం ఆర్జించాయి. సంఘటిత ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధికి భారత జీసీసీ వ్యవస్థ మూలస్తంభంగా ఎదుగుతోందని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ సీఈవో నీతి శర్మ తెలిపారు. కొత్త రిక్రూట్స్‌లో 14–22 శాతం మంది ఏఐ, క్లౌడ్, డేటా ఇంజినీరింగ్‌లాంటి డిజిటల్‌ నైపుణ్యాలు గల ఫ్రెషర్స్‌ ఉండబోతున్నారని పేర్కొన్నారు. మిగతా 76–86 శాతం మంది మధ్య స్థాయి ప్రొఫెషనల్స్‌ ఉంటారని వివరించారు.

Updated On
ehatv

ehatv

Next Story