టెక్ లేఆఫ్స్ ను ట్రాక్ చేసే ‘లేఆఫ్స్.ఎఫ్ వైఐ’ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకూ సుమారు 257 ఐటీ కంపెనీలు తమ సిబ్బందిని తగ్గించుకున్నాయి.

టెక్ లేఆఫ్స్ ను ట్రాక్ చేసే ‘లేఆఫ్స్.ఎఫ్ వైఐ’ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకూ సుమారు 257 ఐటీ కంపెనీలు తమ సిబ్బందిని తగ్గించుకున్నాయి. దీనివల్ల దాదాపు 1,22,000 మందికి పైగా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ ఆర్థిక అనిశ్చితి 2025లో పరాకాష్టకు చేరుకోవడం గమనార్హం. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అంటే ఓ లెవెల్లో చూశారు. లక్షల్లో జీతం, కార్పొరేట్‌ లైఫ్‌, వీకెండ్ పార్టీస్, ఇంకా ఎన్నో వసతులు ఉంటాయి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి మాత్రమే తమ కూతుర్లను ఇచ్చి పెళ్లి చేస్తామనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉండేవారు. కానీ ఇప్పుడు సాఫ్ట్ వేర్ అంటే ఇప్పుడు ఒక ఉపద్రవంలా మారింది. గ్యారెంటీ లేని జీవితంగా తయారైంది. ఏఐ, ఆటోమేషన్ రాకతో సాఫ్ట్ వేర్ నిపుణుల బతుకులు ఆగమవుతున్నాయి. ఈ పరిణామం ఐటీరంగంలో లేఆఫ్స్ కు దారితీసి లక్షల మంది ఐటీ నిపుణులను రోడ్డునపడేలా చేస్తున్నాయి.

2025 సంవత్సరం ఐటీ ఉద్యోగులకు ఒక పీడకలలా మారింది. ఏడాది ముగిసే సమయానికి ఐటీ రంగంలో ఉద్యోగాల కోత ఊహించని స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు మొదలు కొని స్టార్టప్ ల వరకూ ‘పింక్ స్లిప్పుల’ పరంపర కొనసాగిస్తున్నాయి.

వరల్డ్‌ టెక్‌ దిగ్గజాల కంపెనీల్లో కూడా ఈ కోతలు పడ్డాయి. కంపనీలు AI టూల్స్ వాడటం వల్ల కొంతమంది ఉద్యోగుల పనిని ఆటోమేషన్‌ చేస్తుంటాయి. ఈ ఉద్వాసనల వేటు కేవలం చిన్న కంపెనీలకే పరిమితం కాలేదు. బిజినెస్ మోడల్స్ మార్చడం, ఖర్చులు తగ్గించడం కోసమే కారణంగా కొంతమంది ఉద్యోగులు కోతకు గురవుతున్నారు. అమెజాన్‌లో 14,000కుపైగా ఉద్యోగాలు, ఇంటెల్‌లో 24 వేలు, మైక్రోసాఫ్ట్‌లో 9 వేల ఉద్యోగాలు, మెటాలో ఆరు వందలు, సేల్స్ ఫోర్స్‌లో 4 వేలు, సిస్కోలో 4250 ఉద్యోగాలు తొలగించారు. ఇలా ఈ ఏడాది దాదాపు 1.22 లక్షల ఉద్యోగాలు పోయాయి.

Updated On
ehatv

ehatv

Next Story