✕
: Ntv జర్నలిస్టులకు బెయిల్..!

x
ఎన్టీవీలో ప్రసారమైన ఓ కథనానికి సంబంధించిన కేసులో అరెస్టు చేసిన జర్నలిస్టులకు 14వ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు చేసిన ఎన్‌టీవీ జర్నలిస్టులను హైదరాబాద్ పోలీసులు ఇన్‌ఛార్జ్ 14వ ఏసీఎంఎం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఓ కథనానికి సంబంధించిన కేసులో ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు సీనియర్ జర్నలిస్ట్‌లు దొంతు రమేష్, సుధీర్ లను బషీర్ బాగ్ సీసీ ఎస్ నుంచి మణికొండలోని ఇన్‌ఛార్జ్ 14వ ఏసీఎంఎం మేజిస్ట్రేట్ వద్దకు సిసిఎస్ పోలీసులు తరలించి హాజరుపరిచారు. కేసుకి సంబంధించి మేజిస్ట్రేట్ ముందు వాదనలు కొనసాగాయి. వాదనలను విన్న మేజిస్ట్రేట్ జర్నలిస్టులకు రిమాండ్ విధించాలన్న పోలీసుల అభ్యర్థనను తిరస్కరించారు.

ehatv
Next Story

