హయత్‌నగర్‌లో ఆదివారం రాత్రి పైల్స్ సమస్యతో సైదా పైల్స్ క్లినిక్‌లో చికిత్స పొందుతున్న 17 ఏళ్ల బాలుడు ఆపరేషన్ వికటించి మరణించాడు.

హయత్‌నగర్‌లో ఆదివారం రాత్రి పైల్స్ సమస్యతో సైదా పైల్స్ క్లినిక్‌లో చికిత్స పొందుతున్న 17 ఏళ్ల బాలుడు ఆపరేషన్ వికటించి మరణించాడు. దీంతో మృతుడి బంధువులు ఆందోళనకు దిగి, నకిలీ డాక్టర్లు క్లినిక్‌లు పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. హయత్‌నగర్‌లోని సైదా పైల్స్ క్లినిక్‌లో జరిగిన ఈ ఘటన జరిగింది. ఈనెల 22న సాయంత్రం మల్లాపూర్‌కు చెందిన 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థి, పైల్స్ సమస్యతో క్లినిక్‌లో చికిత్స తీసుకున్నాడు. ఆపరేషన్ సమయంలో వికటించి మరణించాడు. నకిలీ డాక్టర్లు చేసిన చికిత్స కారణంగా ఇది జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి బంధువులు ఆందోళనకు దిగి, క్లినిక్ ముందు నిరసన చేశారు. నకిలీ డాక్టర్లు క్లినిక్‌లు తెరిచి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని, ఇలాంటి సంస్థలపై తీవ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


