తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను తీవ్ర వేదనకు గురిచేసినట్లు సౌత్ ఫస్ట్ పత్రికలో సంచలన కథనం వచ్చింది.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను తీవ్ర వేదనకు గురిచేసినట్లు సౌత్ ఫస్ట్ పత్రికలో సంచలన కథనం వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలన పూర్తి చేసుకోకుండానే పార్టీ పతనం కొనసాగుతుండటం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి తనను కలిసిన తెలంగాణ పార్టీ నాయకులతో జరిగిన సంభాషణల సందర్భంగా ఖర్గే ఈ ఆందోళనను వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందడం, మొత్తం పాలనను ప్రజలు చెడుగా చూడటం, పార్టీ- ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రుల మధ్య అంతర్గత కలహాలు, విద్య, ఉపాధి, రాజకీయంగా వెనుకబడిన తరగతుల (BCలు) కోసం పెంచిన రిజర్వేషన్లను సరిగా నిర్వహించకపోవడం వంటి కారణాలున్నాయని ఖర్గే భావిస్తున్నారట.
ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి కోలుకుంటున్న ఖర్గేను కలిసిన ఎమ్మెల్యేల బృందంతో జరిగిన సంభాషణలో, 2023 డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలకు ముందు సోనియా గాంధీ వాగ్దానం చేసిన "ఆరు హామీలను" అమలు చేయడానికి ప్రభుత్వం కాలపరిమితితో కూడిన, పద్దతితో కూడిన విధానాన్ని అవలంబించి ఉండాలని ఖర్గే చెప్పినట్లు తెలుస్తోంది.
రూ.2 లక్షల రుణమాఫీలో వైఫల్యం, రైతు బంధు కూడా సకాలంలో చెల్లించకపోవడం, రెండు సార్లు పూర్తిగా ఇవ్వకపోవడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సానుకూలంగా కంటే ప్రతికూలంగా ఉందని నిరూపించబడింది. మహిళలకు రూ.2,500 నెలవారీ సహాయం, వృద్ధులకు పెరిగిన పెన్షన్ 4 వేల పెన్షన్ ఇప్పటికీ నెరవేర్చకపోవడం వంటి చర్చ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సమన్వయంతో పనిచేయలేకపోవడం, మంత్రులు తమ సొంత సహచరులను బహిరంగంగా చెడుగా మాట్లాడటం కూడా కారణాలున్నాయని ఖర్గే అన్నారట.
