కష్టం, క్రమశిక్షణకు మారుపేరైన చీమల గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది.

కష్టం, క్రమశిక్షణకు మారుపేరైన చీమల గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. తీవ్రంగా జబ్బుపడిన చీమలు తమ జాతిని కాపాడుకోవడానికి ప్రాణత్యాగానికి సిద్ధమవుతాయని ఆస్ట్రియా పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అనారోగ్యానికి గురైన చీమలు రసాయన వాయువు రిలీజ్ చేసి ‘డేంజర్’, ‘నన్ను చంపండి’ అనే సంకేతాలు ఇస్తాయని సైంటిస్టులు చెప్పారు. దీంతో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఆ చీమ గూడును ఇతర చీమలు చీల్చివేస్తాయని తెలిపారు. ఆస్ట్రియాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు చేసిన ఈ స్టడీ, "అల్‌ట్రూయిస్టిక్ డిసీజ్ సిగ్నలింగ్ ఇన్ ఆంట్ కలనీస్" అనే టైటిల్‌తో నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో పబ్లిష్ అయింది. చీమల కలనీలో ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్ ఉంటే చీమల గూడు ఒక "సూపర్-ఆర్గానిజం" లాంటిది. వేలాది చీమలు కలిసి ఒకే యూనిట్‌గా పనిచేస్తాయి.
తీవ్ర అనారోగ్యం వచ్చినవి గూడు వదిలేసి ఒంటరిగా వెళ్లి చనిపోతాయి. ఇది "సోషల్ డిస్టెన్సింగ్" లాంటిదని పరిశోధనలు తెలిపాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్.. మెటరైజియం అనే ఫంగస్ వచ్చినప్పుడు, వీటి బాడీలో కెమికల్ చేంజ్ అవుతుంది. ఈ చీమ ఒక రసాయన వాయువును రిలీజ్ చేస్తుంది. ఇది "ఫైండ్-మీ అండ్ ఈట్-మీ" సిగ్నల్ లాంటిది. దీంతో పక్క చీమలకు ఇలా సంకేతం ఇస్తుందట. "నేను చంపబడాలి, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోండి" అని దీంతో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఆ చీమ గూడును ఇతర చీమలు చీల్చివేస్తాయని తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాలని ఈ అధ్యయనం వెల్లడించింది.


