తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై తాజా CAG నివేదిక ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ & జూలై నెలల మధ్య నాలుగు నెలల్లో ఆదాయం రూ.50,270 కోట్లు అందుకుంది.

తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై తాజా CAG నివేదిక ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ & జూలై నెలల మధ్య నాలుగు నెలల్లో ఆదాయం రూ.50,270 కోట్లు అందుకుంది. కొత్తగా రుణాలు రూ.24,669 కోట్లు తీసుకుంది. వడ్డీ చెల్లింపులు: రూ.9355 కోట్లు (అంటే నెలకు రూ.2338 కోట్లు మాత్రమే). ఏప్రిల్‌లో వడ్డీ రూ.2,260.75 కోట్లు, మేలో వడ్డీ రూ.1,905.60 కోట్లు, జూన్‌లో రూ.2,606.50 కోట్లు, జూలైలో రూ.2,582.52 కోట్లు. సగటున నెలకు కడుతున్న కడుతున్న వడ్డీ - రూ.2338.84 కోట్లు మాత్రమే. కానీ కాంగ్రెస్ నాయకులు, సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నట్లు ఇంతవరకు ఒక్కసారి కూడా అధికారిక ముద్రతో కూడిన లెక్కల్లో కానీ.. అసెంబ్లీలో లిఖిత సమాధానాల్లో కానీ.. ఎక్కడా కూడా రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని చెప్పలేదు. కాగ్‌ ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ సీఎం రేవంత్‌ రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కూడా ఇలా అబద్ధాలు చెప్తున్నారని బీఆర్‌ఎస్‌ వాదిస్తోంది.

ehatv

ehatv

Next Story