తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు తిరుమలకు వెళ్లనున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు తిరుమలకు వెళ్లనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాగా ఈ అర్ధరాత్రి నుంచి తిరుమలలో ఉత్తరద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. లక్షలాది మంది భక్తులు రానుండటంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత శ్రీవారి ఆలయంలో ఏకాంత పూజలు చేస్తారు. ఆ తర్వాత అంటే మంగళవారం ఉదయం నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. ఈ-డిప్‌లో టోకెన్లు కలిగిన భక్తులనే అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి మూడు రోజులైన డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిల్లో SED, శ్రీవాణి దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ పది రోజుల పాటు, తిరుమల మరియు తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్ లైన్ లో శ్రీవాణి ద‌ర్శ‌న టికెట్లు జారీ చేయరు. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేశారు. జనవరి 2 నుండి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా భక్తులకు సర్వ దర్శనం కల్పించనున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story