జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. మొత్తం అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఈ పోరులో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా.. బీజేపీ డిపాజిట్ గల్లంతయ్యింది. దాదాపు 25 వేల ఓట్లతో నవీన్‌ యాదవ్‌ గెలిపించారు. జూబ్లీహిల్స్‌లో నైతిక విజయం తనదే అని BRS అభ్యర్థి మాగంటి సునీత అన్నారు. ఓ మహిళపై ముఖ్య మంత్రి సహా రాష్ట్ర క్యాబినెట్ మొత్తం దౌర్జన్యం చేసి గెలిచిందన్నారు. నియోజకవర్గంలో షేక్పేట, యూసఫ్గూడ సహా చాలా చోట్ల BRS కార్యకర్తలపై దాడులు చేసి, ఓటర్లను భయపెట్టి పోలింగ్ను మేనేజ్ చేశారని ఆరోపించారు. ఇది నవీన్ యాదవ్ సొంత గెలుపు కాదని, రిగ్గింగ్, రౌడీలతో వచ్చిన విజయం అని సునీత మండిపడ్డారు.

Updated On
ehatv

ehatv

Next Story