ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ అరెస్టు వెనుక కుట్ర కోణం దాగున్నదని గాయని కల్పనా రాఘవేంద్ర అనుమానం వ్యక్తంచేశారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ అరెస్టు వెనుక కుట్ర కోణం దాగున్నదని గాయని కల్పనా రాఘవేంద్ర అనుమానం వ్యక్తంచేశారు. అల్లు అర్జున్‌(Allu Arjun) తెలుగు రాష్ర్టాలకే పరిమితం కాదని, ఆయన నేషనల్ స్టార్ అని ఆమె చెప్పారు. అలాంటి వ్యక్తిని బెడ్రూమ్‌లోకి వెళ్లి అరెస్టు చేయడం బాధాకరమని కల్పన(Kalpana) తెలిపారు. సినిమా పెట్టుబడి వ్యాపారమని, లాభాల కోసమే సినిమా తీస్తారని, డబ్బుల కోసమే నటిస్తారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy)చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. పుష్ప-2 చిత్రం వెయ్యి కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిందని, అందులో 18 శాతం జీఎస్‌టీ(GST) ప్రభుత్వానికి చేరుతుందన్న సంగతి ముఖ్యమంత్రికి తెలియదా అని ఆమె ప్రశ్నించారు. మహిళ మృతి వెనుక హత్య లాంటి కుట్ర కోణం దాగి ఉండొచ్చని, విచారణ చేపట్టాలని కల్పన కోరారు.

Updated On
ehatv

ehatv

Next Story