తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్‌(Cyclone Dana) అక్టోబర్‌ 24వ తేదీన బలపడి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్‌(Cyclone Dana) అక్టోబర్‌ 24వ తేదీన బలపడి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి పారాదీప్‌(PharaDeep)కు 520 కిలోమీటర్ల దూరంలో తుపాన్‌ కేంద్రీకృతమై ఉందని, తుఫాన్‌ గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. పూరీ-సాగర్(Puri Sagar) ద్వీపం మధ్య సమీపంలో తీరం దాటనుంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుఫాన్‌ కదులుతోంది. దీని ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం(Srikakulam),విజయనగరం(Vijayanagaram) జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయి. బుధ,గురు వారాల్లో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, అన్ని పోర్టులలో రెండో నెంబర్ హెచ్చరిక జారీ చేశామని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Updated On
ehatv

ehatv

Next Story