బెట్టింగ్ యాప్ వ్యవహారంలో రంగంలోకి దిగింది ఈడీ.

బెట్టింగ్ యాప్ వ్యవహారంలో రంగంలోకి దిగింది ఈడీ. హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసుల ఆధారంగా ECIR నమోదు చేశారు ఈడీ అధికారులు. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోబా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పాండు,పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీతేజ, రీతు చౌదరి, బండారు శేషాయని సుప్రీతపై కేసులు నమోదు చేశారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకూ అందరిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురిని హైదరాబాద్ పోలీసులు విచారించారు. దీనిపై సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. లెటెస్ట్‌గా ఈ వ్యవహారంలోకి ఈడీ ఎంటర్ అవడం ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేయనుంది.
