✕
సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు అరెస్ట్ చేశారు.

x
సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి నాలుగు వాహనాల్లో వచ్చిన NIA అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అంత్యక్రియలకు గాదె ఇన్నయ్య హాజరైనట్లు సమాచారం. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలు రావడంతోనే ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్లు NIA అధికారులు తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.

ehatv
Next Story

