అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో అమ‌లాపురం ప్రాంతానికి చెందిన ఐదుగురు వ్య‌క్తులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ చిన్నాన్న నాగేశర్వరరావు కుటుంబ సభ్యులుగా గుర్తించారు.

అమెరికాలో(America) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. ఈ ప్ర‌మాదంలో అమ‌లాపురం(amalapuram) ప్రాంతానికి చెందిన ఐదుగురు వ్య‌క్తులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్(MLA Ponnada Satish) చిన్నాన్న నాగేశర్వరరావు కుటుంబ సభ్యులుగా గుర్తించారు. టెక్సాస్(Texas) హైవేలో జరిగిన ఈ యాక్సిడెంట్‎లో పొన్నాడ నాగేశ్వరరావు, భార్య సీతామహాలక్ష్మి, కూతురు నవీన, మనవడు, మనవరాలు మృతి చెందారు. నాగేశ్వరరావు అల్లుడు లోకేష్‎కు తీవ్రగాయాలయ్యాయి. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, అమెరికా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాద వార్తతో అమలాపుంలోని బంధువుల ఇళ్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 27 Dec 2023 2:12 AM GMT
Ehatv

Ehatv

Next Story