జానూ లిరి అసలు పేరు జిమ్మిడి ఝాన్సీ, తెలంగాణ(Telangana)లోని కరీంనగర్‌(Karimnagar)కు చెందిన ప్రముఖ ఫోక్ డాన్సర్, జానపద గాయని, సోషల్ మీడియా స్టార్.

జానూ లిరి అసలు పేరు జిమ్మిడి ఝాన్సీ, తెలంగాణ(Telangana)లోని కరీంనగర్‌(Karimnagar)కు చెందిన ప్రముఖ ఫోక్ డాన్సర్, జానపద గాయని, సోషల్ మీడియా స్టార్. ఆమె తన ఎనర్జిటిక్ డాన్స్ పెర్ఫార్మెన్స్‌లు, సాంప్రదాయ జానపద గీతాలతో తెలంగాణలో బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియా ఫేమ్, జానూ లిరి (janulyri)తన సాంప్రదాయ దుస్తులు, తెలంగాణ ఫోక్ డాన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆమె ఫోక్ సింగర్ మంగ్లీతో కలిసి "కనకవ్వ ఆడ నీమలి" అనే పాటలో డాన్స్ చేశారు, ఈ పాట యూట్యూబ్‌లో 15 కోట్ల వ్యూస్ సాధించింది. "అందాల సుందరాంగుడు" వంటి లేటెస్ట్ ఫోక్ సాంగ్స్‌లో కూడా ఆమె కొరియోగ్రఫీ, డాన్స్ చేశారు. ప్రముఖ ఢీ షో (Dhee Show)విజేతగా కూడా జానూ లిరి నిలిచింది. జానూ లిరి తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పలు కమర్షియల్ బ్రాండ్స్‌ను ప్రమోట్‌ చేసింది. దీనివల్ల ఆమె బ్రాండ్ వాల్యూ కూడా పెరిగింది. జానూ లిరి టోనీ(Tony) కిక్‌ను వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే, వారు ఇటీవల విడాకులు తీసుకున్నారు. జానూ లిరి రెండో పెళ్లి గురించి వచ్చిన వార్తలపై స్పష్టత ఇస్తూ ఓ వీడియో పోస్టు చేసింది. అయితే నిన్న తనపై వచ్చిన ట్రోల్స్‌తో ఆత్మహత్య చేసుకుంటానంటూ చేసిన వీడియో మరవకముందే ఆమె మరో వీడియోను పోస్టు చేశారు. తన గురించి వచ్చిన ట్రోల్స్‌ వల్ల డిప్రెషన్‌కు లోనయ్యానని, అందుకే ఆ వీడియో తీశానన్నారు. తాను ఎవరికీ భయపడేది లేదన్నారు. తనపై వచ్చిన ట్రోల్స్‌ వల్లే కొంత డిప్రెషన్‌కు గురయ్యానన్నారు. 'అవును తాను కొత్త లైఫ్‌ లీడ్‌ చేయబోతున్నానని, నేను పెళ్లి చేసుకుంటే మీకేంటి నష్టం, నేను, నా కొడుకు ఇద్దరం కొత్త లైఫ్‌లోకి వెళ్తున్నాం' అంటూ ఆమె మరో వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేశారు.



ehatv

ehatv

Next Story