ఆంధప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆంధప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణాలను వివరిస్తూ '' రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టు ఉంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి చాలా ఆనందంగా ఉంటుంది. పచ్చదనం బాగుంటుంది అని తెలంగాణ నాయకులంతా అంటారు. ఈరోజు కొబ్బరి చెట్లు మొండాలు కూడా లేవు అంత, దిష్టి తగిలింది కోనసీమకు. దీనికి తగిలినంత దిష్టి దేనికీ తగలలేదు. నరుడి దిష్టికి నల్లరాయి అయినా పగిలిపోతుంది, అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడిన వాళ్ళందరి దిష్టి తగిలి ఈరోజు మొండాలతో కొబ్బరి చెట్లు ఉన్నాయి. దీనిని మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని, సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

దీనిపై తెలంగాణ మాజీ మంత్రి ఘాటుగా స్పందించారు. మన తెలంగాణ, హైదరాబాద్‌ నుంచి కోనసీమకు వెళ్లారా. వాస్తవానికి వాళ్ల దిష్టి తెలంగాణకు తగిలింది. మాట్లాడే సమయంలో మైండ్‌తో మాట్లాడాలని, రోజూ కోనసీమ నుంచి వందాలది మంది హైదరాబాద్‌ వచ్చి వెళ్తుంటారు. వాళ్ల దిష్టి ఇక్కడ తగిలిందన్నారు. అలాంటి అజ్ఞానులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అవుతున్నారు. నర దిష్టి పడిందంటాం, ఓ చేను వెంట వెళ్తుంటే బాగుంది చేను అంటారనుకొని చేనులో దిష్టిబొమ్మలు పెట్టుకుంటారు. అలాగే అక్కడ దిష్టిబొమ్మలు పెట్టుకోవాలి, ఎవరు వద్దంటారు, ఆ స్థాయిలో ఉండి మాట్లాడేవారు కనీసం సోయి తెచ్చుకొని మాట్లాడాలని ఆయన పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Updated On
ehatv

ehatv

Next Story