ఓ అరుదైన పక్షిని(Bird) పరిశోధకులు కనుగొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఒటాగా(University of Otaga) జంతు శాస్త్రవేత్త ప్రొ.హీమీష్ స్పెన్సర్‌(Prof. Himesh Spencer) కొలంబియాలో(Columbia) ఈ పక్షిని కనుగొన్నారు. సగం ఆడ(Female), సగం మగ(Male) లక్షణాలు ఈ పక్షిలో ఉన్నాయి. సగం ఆకుపచ్చ(Green), సగం నీలం(Blue) రంగులో ఈ పక్షి ఉంటే.. ఆకుపచ్చ రంగు వైపు ఆడ, నీలం రంగువైపు మగ లక్షణాలున్నాయి.

ఓ అరుదైన పక్షిని(Bird) పరిశోధకులు కనుగొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఒటాగా(University of Otaga) జంతు శాస్త్రవేత్త ప్రొ.హీమీష్ స్పెన్సర్‌(Prof. Himesh Spencer) కొలంబియాలో(Columbia) ఈ పక్షిని కనుగొన్నారు. సగం ఆడ(Female), సగం మగ(Male) లక్షణాలు ఈ పక్షిలో ఉన్నాయి. సగం ఆకుపచ్చ(Green), సగం నీలం(Blue) రంగులో ఈ పక్షి ఉంటే.. ఆకుపచ్చ రంగు వైపు ఆడ, నీలం రంగువైపు మగ లక్షణాలున్నాయి. దీనిని శాస్త్రియంగా ద్వైపాక్షిక గైనండ్రోమోర్పిక్‌ పక్షి(gynandromorphic) అని పిలుస్తారు. గత వందేళ్లలో రెండో సారి ఇలాంటి అరుదైన పక్షి కనిపించిందని తెలిపారు. ఇది ఆడ, మగ లక్షణాను ప్రదర్శిస్తుంది. ఇలాంటి పక్షుల్లో ఒకవైపు మగ ఈకలు ఉండి దానికి అనుగుణంగా పురుష పునరుత్పత్తి అవయవాలు ఉంటాయి. అలాగే మరొక వైపు స్త్రీ ఈకలు ఉండి స్త్రీలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. ఒక గుడ్డు, రెండు స్పెర్మ్‌ల ద్వారా రెండుసార్లు ఫలదీకరణం చెందితే ఇలా జరుగుతుందని ప్రొఫెసర్‌ స్పెన్సర్‌ వివరించారు.
జన్యుపరమైన లోపాలే ఇందుకు కారణమని స్పెన్సర్‌ తెలిపారు.

Updated On 3 Jan 2024 4:18 AM GMT
Ehatv

Ehatv

Next Story